అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య తాజాగా నటించిన శైలజా రెడ్డి అల్లుడు చిత్రం నిన్న వినాయక చవితి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
ఇక ఈ చిత్రానికి నిన్న ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ రావడంతో ఈ చిత్రం కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న ప్రశ్న అందరిలోనూ మొదలైంది. అయితే తొలి రోజు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు రూ 7 కోట్ల వరకు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక తొలిరోజు వసూళ్ళు గమనిస్తే, చైతు కెరీర్ లో ఇదే అత్యుత్తమ తొలిరోజు వసూళ్ళుగా చెప్పుకోవచ్చు.
నిన్న హాలిడే కావడంతో కలెక్షన్స్ బాగా వచ్చాయి, ఇక ఈ ఆదివారం వరకు ఇంకెంత వసూలు చేయనుంది అనే దాన్ని బట్టే ఈ చిత్రం యొక్క భావిష్యత్తు తేలిపోనుంది.
చూద్దాం.. ఈ శైలజా రెడ్డి అల్లుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తాడో..