ఫస్ట్‌లుక్‌: ఆదిగో ఆమే 'దొరసాని'!

మరిన్ని వార్తలు

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'దొరసాని' ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చూడగానే కంటి నిండా ఆకట్టుకుంటోంది. రెండు కళ్లూ చాలవనిపిస్తోంది. ఒక్కసారి చూస్తే, చూపు తిప్పుకోవాలనిపించడంలేదు. దొరసానిగా నటిస్తున్న ముద్దుగుమ్మ ఎవరో కాదు, జీవితా రాజశేఖర్‌ దంపతుల రెండో కూతురు శివాత్మిక. దొరసానిగా లంగా జాకెట్టు ధరించి, మెడలో షార్ట్‌ హారంతో, ముఖంలో అమాయకత్వంతో కూడిన హుందాతనం ఉట్టిపడేలా కనిపిస్తున్న ఈ ఫస్ట్‌లుక్‌ చూసి శివాత్మికపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

 

కారులో దొరసాని కూర్చొని ఉండగా, పక్కనే సైకిల్‌పై కారులోకి తొంగి చూస్తున్న కుర్రాడు.. ఇదీ ఫస్ట్‌లుక్‌. లుక్స్‌ పరంగా శివాత్మిక, అమ్మ జీవితను తలపిస్తోంది. ఎంతో క్యూట్‌గా కనిపిస్తోంది. ఆనంద్‌ దేవరకొండ నేచురల్‌గా కనిపిస్తున్నాడు. అన్నయ్య విజయ్‌ దేవరకొండ ఆటిట్యూడ్‌ అస్సలు కనిపించడం లేదు. రాజు, పేద ఫార్ములాతో తెరకెక్కుతోన్న 'దొరసాని', ఇంతవరకూ ప్రీలుక్స్‌తో ఊరించి, ఊరించి, ఎట్టకేలకు ఫస్ట్‌లుక్‌తో దర్శనమిచ్చింది. తాజా పూతరేకులా ఫ్రెష్‌ ఫీల్‌నిచ్చింది ఈ లుక్‌. ఆనంద్‌ - శివాత్మికల కొంటె ప్రేమ యూత్‌కి ఖచ్చితంగా కనెక్ట్‌ అవుతుందనే నమ్మకం ఈ ఫస్ట్‌లుక్‌తో ప్రూవ్‌ అయిపోయింది. కె.వి.ఆర్‌. మహేంద్ర ఈ సినిమాకి దర్శకుడు. సురేష్‌ ప్రొడక్షన్స్‌తో పాటు, మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌బెన్‌ సినిమా సంయుక్తంగా 'దొరసాని'ని నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS