'రౌడీ స్టార్'గా తన ఆటిట్యూడ్‌తో యూత్ మనసుల్ని కొల్లగొట్టేసిన హీరో విజయ్ దేవరకొండ. ఇంతవరకూ ఆయన ఒక్కడి గురించే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆడి తమ్ముడు కూడా వస్తున్నాడుగా.. ఆయనా ఏం తక్కువ తినలేదండోయ్. తొలి సినిమాకే లిప్‌లాక్ లాగించేశాడు. 'దొరసాని' సినిమాతో ఆనంద్ దేవరకొండ డెబ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ కుమార్తై శివాత్మిక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
టాలీవుడ్‌కి లైవ్ లిప్‌లాక్స్‌ని పరిచయం చేసిన విజయ్ దేవరకొండ తర్వాత యువ హీరోలు చాలా మంది ఈ ట్రెండ్‌ని ఫాలో అయిపోయి పాపులర్ అయిపోయారు. మరి ఆయన తమ్ముడు.. ఎందుకు తక్కువ చేస్తాడు.? అందుకే తొలి సినిమాకే లిప్‌లాక్ లాగించేశాడు. లేటెస్ట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో జస్ట్ శాంపిల్‌కి ఒకటి చూపించారు. కానీ, సినిమాలో ఇలాంటి రొమాంటిక్ సీన్లు చాలానే ఉంటాయట. మనోడు కూడా ఆ రొమాంటిక్ సీన్స్‌తోనే తొలి హిట్ కొట్టాలనుకుంటున్నాడట.
అయినా, మన చాదస్తం కానీ, సినిమాల్లో, అదీ యూత్ కంటెంట్ సినిమాల్లో లిప్‌లాక్స్ లేకుండా ఆడియన్స్‌ని రప్పించడం వల్లవుతుందా.? చెప్పండి. అందుకే డైరెక్టర్లకు తప్పడం లేదు. హీరో, హీరోయిన్లకు అంతకన్నా తప్పడం లేదు. ఏది ఏమైతేనేం.. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా వస్తున్న 'దొరసాని' యూత్‌ని పరిపూర్ణంగా ఎంటర్‌టైన్ చేస్తుందనడంలో ఎంతమాత్రమూ అతిశయోక్తి లేదండోయ్. పక్కా గ్యారంటీ అంటున్నారు కానీ, త్వరలోనే తేలిపోనుందిలే. జూలై 12న 'దొరసాని' ప్రేక్షకుల ముందుకు రానుంది.