సెన్సేషనల్ స్టార్ 'విజయ్ దేవరకొండ' కేవలం తన యాక్టింగ్ అండ్ ఆటిట్యూడ్ తోనే స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే ఈ సెన్సేషనల్ హీరో తమ్ముడిగా 'దొరసాని'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన 'ఆనంద్ దేవరకొండ' కనీస స్థాయిలోనైనా మెప్పించలేకపోయాడు. బలమైన నేపథ్యంలో భావేద్వేగమైన ప్రేమ కథతో తెరకెక్కిన దొరసాని చిత్రంలో పూర్తిగా తేలిపోయాడు. అయితే ఆనంద్ మాత్రం ప్రస్తుతం రెండవ సినిమా చేస్తూనే.. మూడవ సినిమాకు కూడా సైన్ చేశాడు. కాన్సెప్ట్ బేస్డ్ కథగా ఉంటుందట.
షార్ట్ ఫిలిం మేకర్ దామోదర అట్టాడ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా గురించి ఆనంద్ దేవరకొండ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నా డట. అందులో పాత్ర తనకు బాగా నచ్చిందిట. టాంగా ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీరు కూడా గతంలో దామోదర చెప్పిన స్క్రిప్ట్, నరేషన్ నచ్చే సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చామని, హీరో పాత్రలో భిన్న కోణాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఏదో భిన్నమైన కథనే చేయబోతున్నాడన్నమాట.
అయితే మొదటి సినిమాలో ఆనంద్ దేవరకొండకి తన పాత్రలో మంచి ఎమోషన్ని పండించే అవకాశం పుష్కలంగా ఉన్నప్పటికీ.. ఆనంద్ మాత్రం మాట్లాడితే పళ్ళు మొత్తం కనబడేలా ఇకిలించడం తప్పితే.. పెద్దగా సినిమాలో నటించంది కూడా ఏమి లేదు. బలమైన ఎమోషనల్ సన్నివేశాల్లోనైనా మంచి బరువైన ఎక్స్ ప్రెషన్స్ పెడతాడేమోనని మనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తే... బ్లాంక్ పేస్ తో సింగిల్ రియాక్షన్ తో సరిపట్టేశాడు. పోనీ యాక్టింగ్ పరంగా తేలిపోతే.. డాన్స్ పరంగా వీక్ మొమెంట్స్ తో బలం లేదనిపిస్తాడు. మరి తన అన్నయ్య సపోర్ట్ తో వస్తోన్న ఈ విలువైన అవకాశాలని ఆనంద్ దేవరకొండ ఈ సారైనా సద్వినియోగ పరుచుకుంటాడేమో చూడాలి.