నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న 'రూలర్' చిత్రం రిలీజ్ కి శరవేగంగా రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. కథలో బాలయ్య పాత్ర ఓ రేంజ్ లో ఉంటుందట. ఇక `జైసింహా` వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ఈ హిట్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఓ కొత్త పాయింట్ ఉండనుందని సినిమాలో ఆ పాయింట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనపడతారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కు సంబందించి ముందుగా ఎలాంటి క్లూ లేకపోవడంతో అభిమానులు ఈ సినిమా పోస్టర్స్ ను చివరకు టీజర్ ను కూడా వైరల్ చేయలేకపోయారు. మరి చిత్ర బృందం ప్రమోషన్ ప్లాన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు. ఇందులో సొనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. బాలయ్య, రవి కుమార్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలున్నాయి.
ఇక సినిమా విషయంలో బాలకృష్ణ డెడికేషన్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వేరియేషన్ చూపించాలని తపిస్తుంటారాయన. ఆ తపన, డెడికేషన్ మూలంగానే బోయపాటితో చేయనున్న సినిమాలో బాడీ వేరియేషన్ చూపాలనుకుంటున్నారు. అందుకే ప్రతిరోజు గంటల తరబడి వర్కవుట్స్ చేస్తున్నారట. ప్రత్యేకంగా ఫిట్నెస్ నిపుణుడ్ని నియమించుకుని డైట్ కంట్రోల్ పాటిస్తున్నారు. సినిమా మొదలయ్యేనాటికి సుమారు 10 కిలోల వరకు తగ్గాలనేది టార్గెట్. సినిమాలో బాలయ్య లుక్ పూర్తిగా భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు బోయపాటి. అందుకోసం డిసెంబర్ నెలలో లుక్ టెస్ట్ చేయనున్నారు. డిసెంబర్ నెల నుండి సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్నారు. ఇది కూడా 'సింహ, లెజెండ్' తరహాలోనే హెవీ యాక్షన్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది.