'కాప్పన్' సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించిన హీరో సూర్య తన తర్వాతి చిత్రాన్ని దర్శకుడు హరితో ఫైనల్ చేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా సూర్య డైరెక్టర్ శివతో సినిమా చేయాల్సి ఉంది. కానీ శివకు రజనీకాంత్ ప్రాజెక్ట్ సెట్టవడంతో హరితో సినిమాకు రెడీ అయ్యాడు. వీరి కాంబినేషన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది 'సింగం' ప్రాంఛైజీలోని సినిమాలే. ఈసారి కూడా వీరిద్దరూ అలాంటి పోలీస్ స్టోరీతోనే సినిమా చేస్తారని అనుకున్నారంతా. కానీ అలా చేయట్లేదట.
ఇప్పటికే 'సింగం' సిరీస్ నందు మూడు సినిమాలు చేసి ఉండటంతో ఈసారి కొత్త తరహా కథను చూజ్ చేసుకున్నారట. ఇది పక్కా మాస్ స్క్రిప్ట్, 'సింగం' సినిమాల తరహాలో పోలీస్ కథలా ఉండదట. ఈ విషయం తెలిసిన సూర్య ఫ్యాన్స్ గతంలో చేసిన 'ఆరు, వేల్' లాంటి డిఫరెంట్ సినిమా ఏదైనా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. మరి ఆరవసారి కలిసి పనిచేస్తున్న సూర్య, హరిలు ఎలాంటి సినిమాను అందిస్తారో చూడాలి.
ఏమైనా సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్స్ చాల మందే ఉన్నారు. కానీ ప్రతి సినిమాలో కొత్తగా ట్రై చేస్తూ.. వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులకు డిఫరెంట్ చిత్రాలను అందిస్తూ.. ప్రతి సినిమాను ఓ ఛాలెంజింగ్ గా తీసుకుని చేసే స్టార్ హీరోల్లో.. సూర్య పేరు ముందు వరుసలో ఉంటుంది. అందుకే సూర్య ఖాతాలో 'సింగం' వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ లు.. 'గజినీ', 'సెవెన్త్ సెన్స్' వంటి ఓ కొత్తరకం సినిమాలు... 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' వంటి డిఫరెంట్ లవ్ స్టోరీలు ఉన్నాయి. అయితే ఈ మధ్య సూర్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుస డిజాస్టర్ లుగా నిలుస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో సూర్య నటిస్తున్న ఈ సినిమాతోనైనా సూర్య మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.