నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం జై సింహలోని ఒక సన్నివేశం ఇప్పుడు అంతర్జాలంలో తెగ చక్కర్లు కొడుతున్నది. అయితే ఇప్పుడు ఆ సన్నివేశం గురించి భారతదేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఆనంద్ మహీంద్రా ఒక సెటైర్ వేశారు. దీనితో ఇప్పుడు ఈ అంశం మరింత వైరల్ అవుతున్నది.
ఇంతకి ఆ సన్నివేశం ఏంటంటే- బాలకృష్ణ ఒంటి చేత్తో మహీంద్రా బొలెరో వెహికల్ ని పైకి ఎత్తుతాడు. సాధారణంగా ఇటువంటి సన్నివేశాలు అభిమానుల కోసం డిజైన్ చేస్తుంటారు, ఇది కూడా అటువంటి సన్నివేశమే. అయితే ఈ సన్నివేశాన్ని చూడండి అంటూ మహీంద్రా సంస్థల చైర్మన్ అయిన ఆనంద్ మహీంద్రాకి ట్విట్టర్ ద్వారా ఒక వ్యక్తి ఈ వీడియో పంపాడు.
ఇది చూసిన ఆయన వెంటనే- ఇలా ఒంటి చేత్తో ఎత్తేసే పనే అయితే, మా సర్వీస్ సెంటర్స్ లో ఇక వెహికల్స్ పైకి లేపడానికి హైడ్రాలిక్ లిఫ్టుల అవసరం ఉండదు అంటూ చిన్న పాటి సెటైర్ వేశారు. ఒకరకంగా ఇది సెటైర్ అయినప్పటికీ ఇప్పుడు బాలకృష్ణ జై సింహ చిత్రాని దేశ స్థాయిలో ప్రాచుర్యం దొరికింది అనే చెప్పాలి.
ఏదేమైనా ఇటువంటి పబ్లిసిటీ జై సింహ టీం కూడా ఊహించి ఉండకపోవచ్చు.