ఈ వారం సోలోగా విడుదల అయి బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తున్న ఆనందో బ్రహ్మ చిత్రానికి పదేళ్ళ క్రితం చార్మీ లీడ్ రోల్ లో వచ్చిన మంత్ర సినిమాకి పోలికలు ఉన్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ రెండు చిత్రాలలో ఒక కామన్ పాయింట్ ఏంటంటే- దయ్యాలు ఉన్నాయి అంటూ ఎవరు కొనుగోలు చేయని ఇంటిని అమ్మేలా చేయడానికి ప్రధాన తారాగణం ఆ ఇంటిలోకి వెళ్ళి అక్కడ దయ్యాలు లేవు అని నిరూపించాలి అని అనుకోవడమే.
ఈ ఒక్క పాయింట్ మినహాయిస్తే, మరే పాయింట్ కూడా ఈ రెండు చిత్రాలలో కనిపించదు. ముఖ్యంగా దయ్యాలు.. మనుషులకి బయపడడం అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా గతంలో వచ్చిన అన్ని హారర్ చిత్రాలకి భిన్నంగా నిలుస్తున్నది.
ఇక ఈ చిత్రంలో కామెడీ కంటెంట్ కూడా ఎక్కువగా ప్రేక్షకులని అలరించడం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. సో.. మీరు ఈ చిత్రాన్ని చూసి బాగా ఎంజాయ్ చేయండి.