ఇంకొక రెండు రోజుల్లో మెగా అభిమానులందరికీ పెద్ద పండగ మొదలుకానుంది. అదే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగష్టు 22) అలాగే ఆయన నటించబోయే 151వ చిత్రం తాలుకా టైటిల్ అనౌన్స్మెంట్ లు జరగబోతున్నాయి.
ఈ తరుణంలో మెగా కోడలు, రామ్ చరణ్ భార్య అయిన ఉపాసన ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ- తన మామయ్యకి తమ కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటాను అనే కానుక ఇవ్వనున్నట్టు తెలిపింది.
కుటుంబంలో ఎటువంటి అపార్దాలకి తావులేకుండా చక్కగా అందరు కలిసిమెలిసి ఉండేలా చూసుకునేందుకు తన ప్రయత్నం ఎల్లప్పుడు ఉంటుంది అని చెప్పింది.
ఇక చిరంజీవి గారు తనకి ఇచ్చిన గొప్ప కానుక ఏదైనా ఉందా అని అడగగా- తన భర్త మిస్టర్ C నే అని చెప్పింది.