ఫోటోలో బ్లాక్ అండ్ బ్లాక్‌లో స్టైలిష్ లుక్స్‌తో కిర్రాక్ పుట్టిస్తున్న ఈ బ్యూటీ ఎవరనుకుంటున్నారా.? బాలీవుడ్ భామ అనన్యా పాండే. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించిన ఈ ముద్దుగుమ్మ త్వరలో టాలీవుడ్ జనాన్ని తన వల్లో వేసుకునేందుకు రెడీ అవుతోంది. రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఫైటర్’ మూవీ ద్వారా ఈ హాట్ బ్యూటీ తెలుగు తెరకు పరిచయమవుతోంది.
పూరీ జగన్నాధ్ కంపెనీ నుండి ఇంట్రడ్యూస్ అవుతున్న ముద్దుగుమ్మ కాబట్టి, అంత ఆషామాషీగా జనం మర్చిపోయే అవకాశమే లేదండోయ్ ఈ భామని. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా పాప మాత్రం బాగా గుర్తుండిపోతుంది. దటీజ్ పూరీ హ్యాండ్ పవర్ హీరోయిన్స్ విషయంలో. ఇకపోతే, సోషల్ మీడియాలో అమ్మడికున్న ఓ మోస్తరు ఫాలోయింగ్‌ని ఇంకాస్త పెంచుకోవడానికి ఇదిగో ఇలాంటి హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ మ్యాజిక్ చేస్తోంది. చూస్తున్నారుగా బ్లాక్ బ్యాక్ గ్రౌండ్‌లో బ్లాక్ మైక్రో నిక్కర్ ధరించి, మ్యాచింగ్ ఇన్నర్ వేర్‌ని ఎక్స్‌పోజ్ చేస్తూ కవ్విస్తోంది. ఆ పైన సిల్వర్ కలర్ బ్లేజర్ అమ్మడి హాట్ లుక్స్‌కి మరింత బ్రైట్‌నెస్ అద్దుతోంది మరి. టోటల్ గా పిక్ లో గ్లామర్ పోలా అదిరిపోలా.