నాని డైరెక్టర్‌తో నాగచైతన్య కథేంటంటే!

మరిన్ని వార్తలు

నేచురల్‌ స్టార్‌ నానిని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ త్వరలో నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతున్నాడట. విలక్షణ దర్శకుడిగా పేరున్న ఇంద్రగంటితో సినిమా అంటే, అది ఖచ్చితంగా విభిన్న కథా చిత్రమే అయ్యుంటుందని అక్కినేని అభిమానులు ఫిక్స్‌ అయిపోయారు. నిజమే ఓ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ వుండబోతోందట. ప్రస్తుతం నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ మూవీలో నటిస్తున్నాడు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌లో రిలీజ్‌ కావల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా సినిమాకి సంబంధించి కొంత పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ పెండింగ్‌ ఉండిపోయిందట.

 

లాక్‌డౌన్‌ ఎత్తేసిన వెంటనే ఆ చిన్నపాటి వర్క్‌ కంప్లీట్‌ చేసి, సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు, ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ ‘వి’ చిత్రం రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. అన్నీ బావుంటే, ఈ సినిమా కూడా ఈ పాటికి రిలీజ్‌ అయ్యి ఉండేది. కరోనా కారణంగానే ఈ రిలీజ్‌ పోస్ట్‌ పోన్‌ అయ్యింది. ఆలా ఇటు నాగచైతన్య, అటు ఇంద్రగంటి ఇద్దరూ తమ తమ సినిమా రిలీజ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలోనే పరిస్థితులు చక్కబడి, ఆయా సినిమాలు సవ్యంగా రిలీజ్‌కి ముస్తాబైతే, తదుపరి ఈ కాంబినేషన్‌ మూవీపై పర్‌ఫెక్ట్‌ ఐడియాకి రావొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS