తెలుగు నేర్చుకుంటున్న విజయ్‌ హీరోయిన్‌.!

మరిన్ని వార్తలు

రౌడీ విజయ్‌ దేవరకొండ తాజా చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే ఈ ముద్దుగుమ్మకి ఫస్ట్‌ సౌత్‌ మూవీ. ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా షూటింగ్‌లో అనన్య పాండే కూడా హుషారుగా పాల్గొంటోంది . ప్రస్తుతం ముంబయ్‌లో షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో తన పాత్ర ఈ జనరేషన్‌ అమ్మాయిందరికీ చాలా దగ్గరగా ఉంటుందనీ, సింపుల్‌గా కనెక్ట్‌ అవుతుందనీ చెబుతోంది అనన్యా పాండే. అలాగే, విజయ్‌తో నటించడం కొత్త అనుభవం అని చెబుతూ, వీలైతే తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకుంటానంటోంది.

 

ఇప్పుడిప్పుడే తెలుగులో చిన్న చిన్న పదాలు పలుకుతున్న ఈ నార్త్‌ పోరీ అప్పుడే తెలుగు నేర్చేసుకుని డబ్బింగ్‌ చెప్పేస్తుందా.? అంటే, ఏమో ఈ మధ్య వస్తున్న హీరోయిన్లు సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుండడం చూస్తున్నాం. పూజా హెగ్దే, కీర్తి సురేష్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌, రష్మికా మండన్నా.. ఇలా తదితర ముద్దుగుమ్మలు సొంత డబ్బింగ్‌కే ప్రిఫరెన్స్‌ ఇస్తున్నారు. వారి లిస్టులోకే ఈ ముంబయ్‌ భామ కూడా చేరిపోనుందేమో. ‘పైటర్‌’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాని ప్యాన్‌ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లో ఛార్మితో కలిసి పూరీ జగన్నాధ్‌ తెరకెక్కిస్తున్నారు. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS