తల్లిని అసభ్యకరంగా దూషిస్తారా ఎవరైనా? అని సోషల్ మీడియాలో 'అర్జున్‌రెడ్డి' సినిమా హీరో విజయ్ దేవరకొండని ప్రశ్నించి బుల్లితెర స్టార్ యాంకర్, అలాగే వెండితెర ఐటమ్ బాంబ్, జబర్‌దస్త్ బ్యూటీ అనసూయ వార్తల్లోకెక్కింది. సినిమాల్లో ముద్దు సీన్ల పట్ల తనకు అభ్యంతరం లేదని చెబుతూ, సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, మాట్లాడిన మాటలు అసభ్యకరంగా ఉన్నాయని, 'ఏమనుకున్నావ్‌రా..' అనే మాట చివరి పదాన్ని అభిమానులతో తిట్టించారని అనసూయ ఆరోపించడం జరుగుతోంది. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించి, ఎలక్ట్రానిక్ మీడియాకి వెళ్ళిన అనసూయ, అక్కడా తన వాదనను సమర్థవంతంగా విన్పించారు. జబర్‌దస్త్ షోలో సగం బట్టలేసుకుంటోందనీ, 42 ఏళ్ళ వయసున్న ఆంటీ అనీ, ఇంకేవేవో విమర్శలు తన పట్ల రావడం తనకు బాధ కలిగించిందంటున్న అనసూయ, ఎవరికైనా తల్లి తల్లేనని ఎలాంటివారైనా తల్లిని దూషించకూడదని చెబుతూ తాను ఈ విషయంపై పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. సినిమాల్లో ఏం చేసినా అది నటనలో భాగమని చెబుతూ రియల్ లైఫ్‌లో అభిమానుల్ని రెచ్చగొట్టే పద్ధతి మంచిది కాదని హెచ్చరించింది. షార్ట్ డ్రస్ వేసుకోవడం అనేది యాటిట్యూడ్ అని ఇప్పటికే చెప్పిన అనసూయ, ఆ డ్రస్‌లో తల్లి గురించి మాట్లాడితే ఒకలా, చీరకట్టులో తల్లి గురించి మాట్లాడితే ఇంకోలా ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నిస్తూ, ఏ డ్రస్ వేసుకున్నా మాట్లాడే మాటలో ఒకే భావం ఉంటుందని, దాన్ని అర్థం చేసుకునేవారి దురాలోచనలో మార్పు రావాలని అనసూయ అభిప్రాయపడింది.