బుల్లి తెరపై సంపాదించుకొన్న క్రేజ్‌తో వెండి తెర నుంచి అవకాశాలు రాబట్టుకోవడంలో సఫలమైంది అనసూయ భరద్వాజ్. రంగస్థలం, పుష్ప లాంటి సూపర్ డూపర్ హిట్లతో.. తన క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఓవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలూ చేస్తోంది. జయ శంకర్ దర్శకత్వంలో 'అరి' అనే ఓ చిత్రంలో నటించింది అనసూయ. ఈ సినిమాకి నెట్ ఫ్లిక్స్ నుంచి కళ్లు చెదిరే ఆఫర్ వచ్చిందని సమాచారం. డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేస్తే రూ.10 కోట్లు ఇస్తామని నెట్ ఫ్లిక్స్ బేరం పెట్టిందట.
అనసూయ సినిమాకి రూ.10 కోట్లంటే పెద్ద మొత్తమే. పైగా టేబుల్ ప్రాఫిట్ కూడా. అనసూయ లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో కొన్ని సినిమాలు చేసింది. అయితే అవేం.. కమర్షియల్ గా ఆడలేదు. అయినా సరే.. రూ.10 కోట్లు ఇస్తామనడం ఆశ్చర్యకరమైన విషయం. ఈ సినిమాకి మహా అయితే రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకూ బడ్జెట్ అవుతుంది. పబ్లిసిటీకి మరో కోటి రూపాయలు పెట్టినా.. ఆరు కోట్లు. అంటే రూ.4 కోట్లు లాభమన్నమాట. నిర్మాతలకు ఇది పెద్ద డీలే. సో.... 'అరి' నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకొంటారో చూడాలి.