బింబిసారతో ఓ సూపర్ హిట్టు కొట్టాడు కల్యాణ్ రామ్. ప్రస్తుతం బింబిసార 2 కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈలోగా కల్యాణ్ రామ్ చేసిన ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కల్యాణ్ రామ్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రాజేంద్ర రెడ్డి దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొస్తోంది. ఇప్పుడు టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రానికి `అమిగోస్` అనే టైటిల్ ఖరారు చేశారు. విడుదల తేదీ కూడా ఫిక్స్ చేశారు. 2023 ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ``ఎక్స్‌పెక్ట్ ద అనస్పెక్టెడ్`` అంటూ ఓ లుక్ కూడా రవీల్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కొంచెం విచిత్రంగా, కొత్తగా కనిపిస్తోంది. ఇదో యాక్షన్ థ్రిల్లర్ అనే విషయం టైటిల్, ఫస్ట్ లుక్ చూస్తే అర్థమైపోతోంది. కల్యాణ్ రామ్ తో మైత్రీ మూవీస్ చేస్తున్న తొలి సినిమా ఇది. జిబ్రాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. త్వరలోనే టీజర్‌ని సైతం విడుదల చేస్తారని టాక్. `బింబిసార`తో మంచి జోష్‌లో ఉన్న కల్యాణ్ రామ్.. ఈ సినిమాతో ఏమేరకు అలరిస్తాడో చూడాలి.