'రంగమ్మత్త'గా మార్మోగిపోతోంది అనసూయ పేరిప్పుడు. 'రంగస్థలం' పుణ్యమా అని అనసూయకి సుకుమార్ భలే క్యారెక్టర్ ఇచ్చాడులే. వచ్చిన ఈ గోల్డెన్ ఛాన్స్‌ని అనసూయ కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకుంది. దాంతో ఈ క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత అనసూయకి వెండితెరపై చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది.
ఇంతవరకూ అనసూయ అంటే, గ్లామరే. గ్లామర్ అంటే అనసూయే అనుకున్నవాళ్లు కూడా అహో రంగమ్మత్త క్యారెక్టర్‌లో మరొకర్ని ఊహించుకోలేం అని నొక్కి వక్కానించి మరీ చెబుతున్నారు. అందుకే మన రంగమ్మత్తకి ఆఫర్లు వరదలా పోటెత్తుతున్నాయట. అందులో భాగంగానే రంగమ్మత్తకి మరో బంపర్ ఛాన్స్ వచ్చిందనీ సమాచారమ్. అదేంటంటే మళ్లీ మెగా కాంపౌండ్ నుండే అనసూయకి కబురొచ్చిందట.
మెగా పవర్‌స్టార్ సినిమాలో నటించిన అనసూయ ఈ సారి మెగా ప్రిన్స్ సినిమాకి ఛాన్స్ దక్కించుకుందట. మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'ఎఫ్ 2' అనే టైటిల్‌ని కూడా ఫిక్స్ చేసేశారు. 'పటాస్', సుప్రీమ్' తదితర సినిమాలతో విజయాలను అందుకున్న అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోనే అనసూయ ఓ ఇంపార్టెంట్ రోల్‌కి ఛాన్స్ కొట్టేసిందనీ తెలుస్తోంది.
'రంగస్థలం'లో రంగమ్మత్తగా అనసూయ పర్‌ఫామెన్స్ చూశాక, ఆ తరహా క్యారెక్టర్స్‌ని అనసూయ కోసం ప్రత్యేకంగా క్రియేట్ చేయాలనుకుంటున్నారట మన దర్శక నిర్మాతలు. అదీ మన 'రంగమ్మత్త' మేనియా.