వయసు పెరుగుతున్న కొద్దీ... గ్లామర్ నీ పెంచుకుంటున్న తార.. అనసూయ. బుల్లి తెరపైనుంచి వచ్చి, వెండి తెరపై కూడా స్టార్ గా వెలుగొందుతోంది. ఇది వరకటితో పోలిస్తే.. అనసూయ ఇప్పుడే మహా బిజీ. అయితే వ్యక్తిగత జీవితానికీ ప్రాధాన్యం ఇస్తోంది. తన జీవితం, కలలు, సంసారం గురించి... ఈమధ్య కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. అనసూయకు మళ్లీ తల్లి కావాలని ఉందట.
ఈసారి ఓ ఆడపిల్లని కనాలని వుంది అంటోంది. నలభై ఏళ్ల తరవాత..ఓ ఆడబిడ్డకి తల్లిగా మారడానికి ప్రయత్నిస్తానని, అప్పుడు మాత్రం తన జీవితంలో ఎక్కువ సమయం ఆ పాప బాధ్యతలు చూసుకోవడానికే కేటాయిస్తానంటోంది. అమ్మాయిని పెంచి పోషించడంలో ఓ థ్రిల్ ఉందని, తనకు అది చాలా ఇష్టమని అంటోంది. అంతేకాదు.. తన ప్రేమకథలో చాలా మసాలా ఉందని, ఎప్పటికైనా తన కథని తానే సినిమాగా తీస్తానని, అందుకోసమైనా బాగా డబ్బులు కూడబెట్టాలని అంటోంది అనసూయ.