బాలీవుడ్ బ్యూటీ తనూశ్రీ దత్తా, నటుడు నానా పటేకర్‌పై చేసిన ఆరోపణల కారణంగా 'మీ టూ' ప్రకంపనలు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల అనుభవాలను ఒక్కొక్కరుగా బయటికి చెప్పేందుకు వస్తున్నారు. ఈ విషయమై కొందరు తనూశ్రీకి మద్దతుగా నిలవగా, మరికొందరు విమర్శిస్తున్నారు.
తాజాగా క్రేజీ హాటెస్ట్ యాంకర్ అనసూయ ఈ విషయమై మీడియా ముఖంగా తన స్పందనను తెలిపింది. అమ్మాయిలపై లైంగిక వేధింపులు అనేవి లేవని చెప్పలేను కానీ, స్వతహాగా అమ్మాయిలు తాము ఏ పని చేస్తున్నామో ఆ పని మీద పక్కా క్లారిటీతో ఉండాలని అనసూయ చెప్పింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి లైంగిక వేధింపులకూ లొంగకూడదనీ, ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే మనస్థత్వాన్ని అలవర్చుకోవాలనీ అనసూయ చెప్పింది.
అలాగే ఈ వేధింపులు అనేవి కేవలం అమ్మాయిలకే కాదు, పిల్లలకు, మగవారికీ, ఆఖరికి జెండర్‌తో సంబంధం లేకుండా అందరి విషయంలోనూ ఈ వేధింపులున్నాయనీ, అయితే బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమ గళం గట్టిగా వినిపించాలనీ ఆమె సూచించింది. అంతేకాదు, ఒక్క సినీ రంగానికే ఈ లైంగిక వేధింపులు పరిమితం కాదనీ, వర్కింగ్ ఏరియాస్ అన్నింట్లోనూ ఉన్నాయనీ అనసూయ చెప్పుకొచ్చింది.
అయితే ఇంతవరకూ తాను అలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదనీ అనసూయ క్లారిటీ ఇచ్చింది.