బాబు గోగినేనికి అంత సీన్ లేదని తేల్చేసిన కౌశల్

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ 2 హౌస్‌లో బాబు గోగినేని Vs  కౌశ‌ల్ ఎపిసోడ్ ఒక‌టి ఆక‌ట్టుకుంది. ఈ షో ర‌క్తి క‌ట్ట‌డానికి వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన మాట‌ల యుద్ధం కూడా ఓ కార‌ణం.  

అది ఎంత‌గా సాగిందంటే... బాబు గోగినేని బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర‌వాత కూడా కౌశ‌ల్ పై కొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా కౌశ‌ల్‌ ఆర్మీ అనేది ఓ ఫాల్స్ అని విరుచుకుప‌డ్డారు. నిజానికి బిగ్ బాస్ హౌస్‌లో కౌశ‌ల్‌కీ బాబు గోగినేనికీ మ‌ధ్య ఏం జ‌రిగింది?  ఇద్ద‌రికీ ప‌డ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేమిటి?  అనే విష‌యాల‌పై ఇప్పుడు కౌశ‌ల్ క్లారిటీ ఇచ్చాడు.

`బాబు గోగినేనితో అంత‌కు ముందు ప‌రిచ‌యం లేదు. రెండు మూడు ఇంట‌ర్వ్యూలు టీవీలో చూశానంతే. బిగ్ బాస్ హౌస్‌లో వెళ్లిన త‌ర‌వాత నాలుగైదు వారాల వ‌ర‌కూ మేం బాగానే ఉన్నాం. నా వ్య‌క్తిగ‌త విష‌యాల్ని ఆయ‌న‌తో పంచుకునేవాడ్ని. కానీ ఏమైందో తెలీదు. నన్ను బ‌య‌ట‌కు పంపించ‌డానికి మిగిలిన హౌస్‌మేట్స్‌తో క‌ల‌సి ఆయ‌న ప్లాన్స్ వేశారు. 

ఓ టాస్క్‌లో `జాతీయ జెండాలోని అశోక చ‌క్రంలో ఎన్ని గీత‌లుంటాయి` అని అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న త‌ప్పుగా స‌మాధానం చెప్పారు. దాంతో నేను ఆశ్చ‌ర్య‌పోయాను. ఓ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిగ‌ర్ కి... జాతీయ జెండా గురించి తెలీదా అనిపించింది`` అంటూ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశాడు కౌశ‌ల్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS