పాపం అనసూయని కొంచెం అర్థం చేసుకోండయ్యా!

మరిన్ని వార్తలు

అనసూయ మాత్రమే ఎక్స్‌పోజింగ్‌ చేస్తోందా? సినిమాల్లో, బుల్లితెరపై గ్లామరస్‌గా కన్పించడం అందాల భామలకి కొత్తేమీ కాదు. సోషల్‌ మీడియాలో అనసూయ మీదనే ఎందుకు కొందరు నెటిజన్లు బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారో ఏమో! అనసూయ నుండి ఏ చిన్న కామెంట్‌ వచ్చినా నెటిజన్లు దాన్ని ఊరికే వదలరు. అనసూయ కూడా వాటి విషయంలో స్పందించడంతో రగడ పెద్దదవుతుంటుంది. అలాగే తాజాగా గణతంత్ర దినోత్సవాన అలాంటి వారిని ప్రశ్నిస్తూ, అనసూయ ఆవేదనాభరితమైన పోస్ట్‌ చేసింది. 

ఇది బాగానే ఉంది కానీ, 'అర్జున్‌రెడ్డి' సినిమా సమయంలో ఓ వివాదాన్ని అనసూయ కెలికింది. అదే ఆమెకు ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది.ఆ సినిమా హీరో విజయ్‌దేవరకొండ, సినిమా ప్రమోషన్‌ సందర్భంగా చేసిన వ్యాఖ్యల్ని ఆమె తప్పుపట్టింది. ఇతరుల తప్పుల్ని ఎంచుతున్నప్పుడు, తమ తప్పుల్ని ఇంకొకరు ఎంచుతారని అనసూయ అర్థం చేసుకుంటే బెటర్‌. అన్నిటికీ మించి సోషల్‌ మీడియాలో టైమ్‌పాస్‌ కుర్రాళ్ళెక్కువ. టైమ్‌పాస్‌ కోసం తమకు నచ్చిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఉంటారు. 

అలాంటి వారిని పట్టించుకుంటే, వారికి ఫ్రీగా పబ్లిసిటీ ఇచ్చినవాళ్లమవుతాం కానీ అంతకు మించి ఒరిగేదేమీ ఉండదు. సో అలాంటివారిని పట్టించుకోకపోతేనే మంచిది. అకా కాక ప్రశ్నిస్తూ పోతుంటే, నెగెటివ్‌ కామెంట్లూ ఇంకా ఎక్కువైపోతుంటాయ్‌. దీనికి ఫుల్‌ స్టాప్‌ పడటం కష్టమే. అయితే ప్రశ్నించడం అనసూయ తప్పు కాదు. అలాగే, ఆమెపై కామెంట్లు వేసేవారినీ ఆపతరం కాదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS