అనసూయ దెబ్బకి ‘అది’ ఆగుతుందా?

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియాలో సెలబ్రిటీలపై బూతుల వ్యవహారం కొత్తదేమీ కాదు. మార్ఫింగ్ ఫొటోలు, ఫేక్ వీడియోలు.. వీటికి తోడు హీరోయిన్ల పేరుతో వల్గర్‌ కామిక్స్‌.. బూతు కథలు.. ఇదంతా ఎప్పటినుంచో వున్నదే. అయితే, చాలామంది హీరోయిన్లు వీటిని లైట్‌ తీసుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే, సోషల్‌ మీడియాని కంట్రోల్‌ చేయడం ఎవరి తరమూ కాదు. అయితే, పోరాటం ఎక్కడో ఓ చోట మొదలవ్వాల్సిందే. అనసూయ భరద్వాజ్‌ ఈ విషయంలో ముందడుగు వేసిందని అనుకోవాలేమో. తన పట్ల అసభ్యకరమైన రాతలు రాస్తోన్న ఓ ట్విట్టర్‌ హ్యాండిల్‌పై అనసూయ ఫిర్యాదు చేసింది. తొలుత స్వయంగా ట్విట్టర్‌ సంస్థకే ఫిర్యాదు పంపింది.

pic.twitter.com/G4I3KRwFQ9

 

అయితే, ట్విట్టర్‌ సంస్థ తేలిగ్గా తీసుకుంది ఈ విషయాన్ని. వెంటనే, సైబర్‌ క్రైవ్‌ు పోలీసులకీ పరిస్థితిని వివరించింది సోషల్‌ మీడియా వేదికగానే. అంతే, సైబర్‌ క్రైవ్‌ు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారామెకి. ఒక్క అనసూయకు సంబంధించిన విషయం మాత్రమే కాదిది. చాలామంది హీరోయిన్లు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. హీరోలు సైతం ఇందుకు మినహాయింపేమీ కాకపోవడం గమనార్హం. అయితే, ‘అనంతం’గా మారిపోయిన సోషల్‌ మీడియాలో కలుపు మొక్కల్ని ఏరివేయడం అంత తేలిక కాదు. పది అక్కౌంట్లను క్లోజ్‌ చేస్తే, వంద పుట్టుకొచ్చే రోజులివి. మరి, ఈ సమస్యకు పరిష్కారమెలా.? తొలి అడుగు పడింది గనుక, పరిష్కారం లభిస్తుందనే ఆశిద్దాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS