ముస్తాబవుతోన్న 'రంగమ్మత్త 2.0'!

మరిన్ని వార్తలు

'రంగస్థలం' సినిమాతో 'రంగమ్మత్త'గా ఫిక్సయిపోయింది హాట్‌ యాంకర్‌ అనసూయ. ఆ సినిమాతో ఏకంగా హీరోయిన్‌కి వచ్చినంత క్రేజ్‌ సంపాదించింది అనసూయ. ఆ తర్వాత వరుసగా మంచి పాత్రలతో దూసుకెళుతోంది. అయితే, ఎలాంటి పాత్రయినా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో అనసూయ తర్వాతే ఎవరైనా. స్పెషల్‌ సాంగ్‌ అయినా, స్పెషల్‌ రోల్‌ అయినా ఏదైనా తనకు తగ్గట్లు మలచుకుని, తనదైన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో 'రంగస్థలం' సినిమాలో అపూర్వమైన నటన ప్రదర్శించిన అనసూయ, ఆ తర్వాత 'ఎఫ్‌ 2' సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత 'కథనం' అంటూ సోలో పర్‌ఫామెన్స్‌ ఇచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి రంగమ్మత్త సత్తా చాటనుందట. అసలీ 'రంగమ్మత్త' పాత్ర ఎలా ఉద్భవించింది. మన లెక్కలు మాస్టారు సుకుమార్‌ ఆ పాత్ర కోసం ఎంత మంది ఆర్టిస్టులనో పరిశీలించి, అన్ని లెక్కలూ పక్కాగా తేల్చి అనసూయని ఆ పాత్ర కోసం ఎంచుకున్నాడు.

 

ఇప్పుడు మళ్లీ ఆయనే తన సినిమాలో అనసూయ కోసం ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ సిద్ధం చేశాడనీ తెలుస్తోంది. 'రంగమ్మత్త'ని కొట్టే పాత్రట అది. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర కోసం అనసూయ పేరును పరిశీలిస్తున్నాడట సుకుమార్‌. ఇప్పుడీ వార్త నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే, మళ్లీ సుకుమార్‌ పుణ్యమా అని అనసూయ 'రంగమ్మత్త 2.0' అనిపించుకుంటుందేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS