అనసూయకి అది కలిసొచ్చేసింది

మరిన్ని వార్తలు

'రంగస్థలం' సినిమా దూకుడుకి ఇంకా బ్రేకులు పడట్లేదు. వసూళ్లు వర్షం ఆగలేదు. ఎక్కడికక్కడే జోరు ప్రదర్శిస్తోంది. సినిమా చూసిన వారు ఒక్కసారి కాదు, ఇంకోస్సారి అనుకునేలా ఉంది ఈ 'రంగస్థలం'. చరణ్‌ పర్‌పామెన్స్‌కి అస్సలు మాటల్లేవ్‌. మాట్లాడుకోవటాల్లేవ్‌. ఇకపోతే రంగమ్మత్త పాత్ర పోషించిన అనసూయకి ఈ సినిమా మంచి బ్రేకిచ్చిందనే చెప్పాలి. అనసూయకున్న క్రేజ్‌ని అమాంతం పెంచేసింది 'రంగస్థలం'. 

అంతేనా, హీరోయిన్‌గా సమంత పాత్రను కూడా అనసూయ క్యారెక్టర్‌ డామినేట్‌ చేసేసిందంటే అతిశయోక్తి కాదనిపిస్తోంది. అనసూయ అంటేనే గ్లామర్‌కి కేరాఫ్‌ అడ్రస్‌. 'రంగమ్మత్త' పాత్రకు ఆ గ్లామరే మిస్సవుతుందని భావించినవారంతా సినిమా చూశాక తప్పులో కాలేసినట్లే అయ్యింది. సినిమాలో అనసూయ క్యారెక్టర్‌కి అంతగా మసాలా కూడా దట్టించేశాడు సుకుమార్‌. ఆ క్యారెక్టర్‌ కోసం సుకుమార్‌ ఎందుకంత రీసెర్చ్‌ చేశాడో తెలుస్తుంది. చాలా చోట్ల అనసూయ క్యారెక్టర్‌కిచ్చిన వెయిట్‌కి హీరోయిన్‌ క్యారెక్టరే చిన్నబోయిందంటే నమ్మి తీరాల్సిందే. 

ఇదే కాదు, పబ్లిసిటీ విషయంలో కూడా సమంత మిస్‌ అవ్వడంతో ఆ టైం అనసూయకి బాగా కలిసొచ్చేసింది. సమంత విహార యాత్రలో ఉన్న కారణంగా, 'రంగస్థలం' ప్రమోషన్స్‌లో సమంత ప్లేస్‌ని కూడా అనసూయే కవర్‌ చేసేస్తోంది. ఇకపోతే ఇదే జోరు కొనసాగితే, 'బాహుబలి' రికార్డుల్ని ఒక్కొక్కటిగా 'రంగస్థలం' క్రాస్‌ చేసేయడం ఖాయమని అంచనా వేస్తున్నారు ట్రేడ్‌ పండితులు. 

మరో పక్క ట్విట్టర్‌ వేదికగా పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ లిస్టుతో తాజాగా సంచలనాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కూడా చేరిపోయారు. రామ్‌చరణ్‌ నటన అద్భుతం, అని వర్మ ప్రశంసించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS