బాలయ్య కి దిమ్మతిరిగే కౌంటర్ వేసిన ఎన్టీఆర్..!

మరిన్ని వార్తలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా VIVO IPL 2018 తెలుగుకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక అయ్యాడు అన్న విషయం విదితమే. ఈ తరుణంలో ఈ సీజన్ కి సంబంధించి ఒక TVCని విడుదల చేశారు.

కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి, ఆ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఆ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్న ఏంటంటే- ఒక నేషనల్ హీరో కాని ఒక స్పోర్ట్స్ పర్సన్ పాత్రని ఒక చిత్రంగా చేయవలసి వస్తే లేదా ఒక బయోపిక్ ని ఆఫర్ చేస్తే మీరు చేస్తారా?

 

దీనికి ఆయన నేను ఒక సాధారణ నటుడిని మాత్రమే, ఒక నేషనల్ హీరోని పాత్రకి తాను న్యాయం చేయలేను అన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు అలాగే నాకు అంత గట్స్ లేవు అని చెప్పాడు. బయోపిక్స్ కి తాను దూరం అనే మాటని చెప్పకనే చెప్పేశాడు.

అలాగే తనకి తన కొడుకుకి క్రికెట్ పట్ల ఎంత ప్రేమ ఉందొ చెప్పాడు, తన కొడుకు భవిష్యత్తులో క్రికెటర్ కావాలంటే తప్పకుండా చేస్తాను అని చెప్పాడు.

కొసమెరుపు- ఎన్టీఆర్ బయోపిక్ లో మీరు నటిస్తున్నారా అని అడగగా.. నాకైతే ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి అని ఎన్టీఆర్ ముగించాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS