'రంగమ్మత్త' చర్యలు ఊహాతీతం సుమీ.!

మరిన్ని వార్తలు

గ్లామర్‌ బ్యూటీగా బుల్లితెరపై అడుగు పెట్టిన యాంకర్‌ అనసూయ మెల్ల మెల్లగా వెండితెరను తన గ్లామర్‌ ఘుమఘుమలతో గుబాళింపచేసింది. వెండితెరపై అనసూయ చిన్న చిన్న క్యారెక్టర్స్‌తో స్టార్ట్‌ చేసి, ఐటెం సాంగ్స్‌ వరకూ ఎదిగింది. అనసూయకి అంత సీన్‌ లేదు. ఇక ఇలా ఐటెం గాళ్‌గా గ్లామర్‌ తారగా సెటిలైపోతుందంతే.. అనుకున్న టైంలో అనుకోకుండా 'రంగస్థలం' సినిమా ఆఫర్‌ వచ్చింది.

 

మొదట్లో ఏదో చిన్న క్యారెక్టర్‌ అయ్యుంటుందిలే అనుకుని లైట్‌ తీసుకున్నారంతా. కానీ సినిమా విడుదలయ్యాకే కదా, అనసూయ ప్రతాపం ఏంటో తెలిసింది. వీర లెవల్లో 'రంగమ్మత్త'గా అలరించేసింది అనసూయ. దాంతో ఆడియన్స్‌ అనసూయపై అంత వరకూ ఉన్న తమ అభిప్రాయాలను వెంటనే వాపస్‌ తీసుకోక తప్పలేదు. 'రంగమ్మత్త' క్యారెక్టర్‌లో అనసూయని చూసిని మన టాలీవుడ్‌ దర్శక నిర్మాతలు కూడా తమ సినిమాలో అనసూయ ఉంటే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చేశారట. దాంతో అనసూయ కోసం స్పెషల్‌ క్యారెక్టర్స్‌ డిజైన్‌ చేయిస్తున్నారట. 

ఆల్రెడీ అనసూయ మరో మెగా కాంపౌండ్‌ హీరోతో ఛాన్స్‌ కొట్టేసిందంటూ వార్తలు గత కొంత కాలంగా వస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ అని కూడా ప్రచారం జరుగుతోంది. అదే వెంకీ, వరుణ్‌ మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతోన్న సినిమాలో అనసూయకి ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ని ఆఫర్‌ చేశారనీ తెలుస్తోంది. ఏమో ఈ వార్తని అంత తేలిగ్గా కొట్టి పారేయడానికి లేదండోయ్‌. రంగమ్మత్త పర్‌ఫామెన్స్‌ని తక్కువగా అంచనా వేయడానికి లేదు. 

ఏమో ఈ ఆఫర్‌ దక్కినా దక్కించేసుకుంటుంది మన రంగమ్మత్త. అదీ మన రంగమ్మత్త స్టామినా. ఇందులో నో డౌట్‌.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS