సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం భరత్ అనే నేను చిత్రం పైన కాసుల వర్షంతో పాటుగా ప్రశంసల జల్లు కూడా కురుస్తున్నది. ఇక ఈ జాబితాలో తాజా చేరిన ప్రముఖ సెలబ్రిటీ తెలంగాణ మంత్రి కేటీఆర్.
ఈరోజు మంత్రి కేటీఆర్, మహేష్ బాబు, కొరటాల శివ కలిసి ఈ చిత్రం గురించిన ఒక మినీ చర్చా కార్యక్రమం చేశారు. ఇందులో వీరు ముగ్గురు ఈ చిత్రానికి సంబంధించిన అంశాలు అలాగే అందులోని పలు అంశాలు ఇప్పుడు సమాజంలో పోల్చి చూస్తూ తమ తమ అభిప్రాయలు వ్యక్తం చేశారు.
ఇక ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది అందరిని అలరిస్తుంది అని ఈ ముగ్గురు తమ సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు. దీనితో ఈ సినిమాకి ఇప్పటికే ఉన్న మంచి టాక్ ఇప్పుడు మరింతగా పెరిగిపోనుంది.
మొత్తానికి భరత్ అనే నేను ఇప్పుడు కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టనుంది.