నెట్టింట్లో రంగమ్మత్తకు చుక్కెదురు.!

మరిన్ని వార్తలు

నెట్టింట్లో రంగమ్మత్త అలియాస్‌ అనసూయ ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ రేంజ్‌లో ఆమెకు ఫాలోవర్స్‌ ఉన్నారక్కడ. అయితే, ఇక్కడ పొగడటంతో పాటు, దుమ్మెత్తి పోయడం కూడా అలవాటు చేసుకోవాలి మరి. అఫ్‌కోర్స్‌, ఫాలోయింగ్‌తో పాటే ఆటోమెటిగ్గా అవి కూడా అలాగే అలవాటైపోతాయనుకోండి. మన రంగమ్మత్త ఆ విషయంలో మోస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌డ్‌. ఇకపోతే, తాజాగా ఓ నెటిజన్‌కి రంగమ్మత్త టార్గెట్‌ అయ్యింది. 'మయూర' అనే ఓ నెటిజన్‌ అనసూయ డ్రెస్సింగ్‌ విషయంలో దుమ్మెత్తి పోసింది. 'నీలాంటి వారిని చూసి సిగ్గుతో తల దించుకుంటున్నా..' అంటూ ఘాటుగా ఓ పోస్ట్‌ చేసింది. అయితే, ఈ పోస్ట్‌పై అనసూయ ఏమాత్రం స్పందించలేదు.

 

ఇదే పోస్ట్‌ ఓ మేల్‌ ఐడీ నుండి వస్తే అనసూయకు కోపం ఉరకలేసేదే. కానీ, ఆ పోస్ట్‌ పెట్టింది ఓ లేడీ కావడం వల్లనేమో, కామ్‌గా ఉండిపోయింది.. అంటూ మేల్‌ నెటిజన్స్‌ అనసూయని ఆడేసుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా, ఎంత వల్గర్‌ అయినా కామెంట్స్‌ని పట్టించుకోకుండా సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ పిక్స్‌తో అనసూయ రెచ్చిపోతూ, తన పని తాను చేసుకుపోతూనే ఉంటుంది. తనకి మూడ్‌ వస్తే ఫైర్‌ అవుతుంది లేదంటే, పోజిటివ్‌ అయినా, నెగిటివ్‌ అయినా ఆ కామెంట్స్‌ని ఒకేలా స్వీకరిస్తుంటుంది. ఇక తాజా కామెంట్‌తో మాత్రం అనసూయ బాగా బుక్కయిపోయినట్లే ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS