ట్రెండ్‌ సెట్‌ చేస్తానంటోన్న తెలుగమ్మాయ్‌!

మరిన్ని వార్తలు

తెలుగుమ్మాయిలు గ్లామర్‌కి దూరమనే అపోహ చాలా వరకూ పోయిందిప్పుడు. ఇంకా ఏదో మూల తెలుగమ్మాయిలు కమర్షియల్‌గా అన్ని రకాల పాత్రలకూ పనికి రారు అనే ఆలోచన ఉంటే తనతోనే తీరిపోవాలంటోంది పదహారణాల తెలుగమ్మాయ్‌ ఈషా రెబ్బ. ఈ మధ్య ఈ పాప సోషల్‌ మీడియాలో చేస్తున్న హాట్‌ రచ్చ అంతా ఇంతా కాదు. అదిరిపోయే అందాలతో హీటెక్కించేస్తోంది. తెలుగమ్మాయి అయ్యి ఉండి అలా ఎందుకు చేస్తున్నావ్‌ అని కామెంట్‌ చేసే వారికి కరెక్ట్‌గా సమాధానం కూడా ఇస్తోంది. తెలుగమ్మాయ్‌ అనే ముద్రతోనే ఈ భామకు ట్రెడిషనల్‌ రోల్స్‌ మాత్రమే దక్కుతున్నాయి.

 

గ్లామర్‌ పాత్రలు అంతగా దక్కడం లేదు. కానీ, నార్త్‌ భామలకు తానేం తక్కువ కాదనీ, ఎలాంటి స్కిన్‌ షో చేయడానికైనా తాను సిద్ధమే అని గట్టిగా చెబుతోంది ఈషా రెబ్బ. ప్రస్తుతం 'లస్ట్‌ స్టోరీస్‌' అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. 'లస్ట్‌ స్టోరీస్‌' అంటే బాలీవుడ్‌లో కైరా అద్వానీ నటించిన అడల్ట్‌ రోలే గుర్తొస్తుంది. అయితే, మన తెలుగమ్మాయ్‌ పోషించే పాత్ర అదేనా.? అంటే, కాదు ఇంకా కొత్తగా ఉంటుంది అని చెబుతోంది. లస్ట్‌ స్టోరీస్‌ అంటేనే బోల్డ్‌ కాన్సెప్ట్‌ అని ప్రింట్‌ పడిపోయింది. మరి, ఈషా రెబ్బ నటిస్తున్న ఎపిసోడ్‌ ఎలా ఉండబోతోందో చూడాలంటే మార్చి వరకూ ఆగాల్సిందేనట. సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో ఈషారెబ్బ నటిస్తున్న 'లస్ట్‌ స్టోరీస్‌' ఎపిసోడ్‌ రూపొందుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS