ఈ మధ్య ఓ చిన్న పిల్లాడితో రేష్‌గా బిహేవ్ చేసిన కారణంగా అనసూయని నెటిజన్లు దుమ్మెత్తిపోయడంతో, ఎందుకొచ్చిన తంటా అని అనసూయ తన ట్విట్టర్ ఖాతా నుండి తప్పుకుంది. ఇటీవల 'రంగస్థలం' సినిమా పుణ్యమా అని మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంటీ ఇచ్చిన నాటి నుండి, అనసూయ తన అభిమానులకు పండగ వాతావరణం కల్పిస్తోంది తన గ్లామర్ అప్పీల్‌తో. 'రంగస్థలం' సినిమాలో యంగ్ అండ్ హాట్ హాట్ 'రంగమ్మత్త' పాత్ర పోషించి, అభిమానుల మనసును కొల్లగొట్టేసింది. క్లాసిక్ పాత్రైనా, కానీ హాట్‌నెస్‌కీ చోటుంది ఈ పాత్రలో. అంతేకాదు, నటన పరంగా కూడా మంచి మార్కులేయించుకుంది అనసూయ 'రంగమ్మత్త'గా. దీంతో ఆమెపై అంతవరకూ నెటిజన్లకున్న కోపం పోయింది. ఇదివరకటి అభిమానమే కురిపిస్తున్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో అనసూయ హాట్‌నెస్‌కి ఎప్పుడూ క్రేజే. ఆ క్రేజ్ ఇప్పుడు 'రంగస్థలం' సినిమాతో మరింత పెరిగిందనే చెప్పాలి. ఆ క్రేజ్‌తోనే అనసూయ హాట్‌నెస్‌తో పాటు, క్యూట్ అప్పీల్‌తోనూ మెరిసిపోతోంది.