డిప్రెషన్ పేరుతో ఆత్మహత్యలు ఈ మధ్య న్యూస్‌లో ఎక్కువగా వినిపిస్తోన్న మాట. తాజాగా ఓ ప్రముఖ తెలుగు ఛానెల్ యాంకర్ అయినా రాధికా రెడ్డి ఈ డిప్రెషన్ పేరుతోనే ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయపై ప్రముఖ బుల్లితెర యాంకర్స్ అనసూయా, రేష్మీ స్పందించారు. గతంలో అనసూయ కూడా ఇలాంటి డిప్రెషన్‌తో బాధపడిందట.
అందుకే ఆ అనుభవంతోనే ఇలాచెబుతోంది. 'ఇది చాలా సాధారణ అనారోగ్య సమస్య మాత్రమే. గతంలో నేను కూడా ఇలాంటి సమస్యతో బాధపడ్డాను. ఇందులో సిగ్గు పడాల్సిందేమీ లేదు. కౌన్సిలింగ్ తీసుకోవడం తప్పనిసరి. దాంతో పాటు కుటుంబ సభ్యులు అర్ధం చేసుకుని అండగా ఉంటే, ఈ సమస్యను మెల్లమెల్లగా అధిగమించొచ్చు. అంతేకానీ ఇలా బలవంతంగా ప్రాణాలు తీసుకోవద్దు ప్లీజ్..' అని అనసూయ స్పందించింది.
అలాగే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నేను కూడా చాలా కష్టాలు అనుభవించాను. మెల్లమెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చాను. ఆత్మహత్య చేసుకుంటే కష్టాలు తీరిపోవు. మానసిక ఒత్తిడితో బలవన్మరణానికి పాల్పడితే జీవితంలో బాగుపడే గొప్ప గొప్ప అవకాశాలెన్నో కోల్పోతాం. దయచేసి, మానసిక ఒత్తిడి కారణంగా ఆత్యహత్యలకు పాల్పడొద్దు, ఈ డిప్రెషన్‌పై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి, సైకియాట్రిస్ట్‌ని కలిసినంత మాత్రాన మనమేమీ పిచ్చోళ్లమైపోము.' అని రేష్మీ ట్వీట్ చేసింది.