రికార్డులు కొల్లగొడుతోన్న 'సంజూ'

మరిన్ని వార్తలు

రన్బీర్ కపూర్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'సంజూ' తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు ఈ సినిమా వసూళ్లు కళ్లు చెదరగొట్టాయి. రన్బీర్ కపూర్‌ కెరీర్‌లో ఈ స్థాయిలో ఓపెనింగ్స్‌ రాలేదు ఏ సినిమాకీ. అంతేనా ఇంతవరకూ తొలి రోజు వసూళ్లలో తొలి స్థానంలో ఉన్న 'రేస్‌ 3' వసూళ్లను కొల్లగొట్టింది 'సంజూ'. 

ఇది నిజంగా ఊహించని పరిణామమే అని చెప్పాలి. విడుదలకు ముందే ఈ సినిమా అందరిలోనూ ఆశక్తిని పెంచింది. బాలీవుడ్‌నే కాదు, టాలీవుడ్‌లో కూడా 'సంజూ' క్రియేట్‌ చేసిన క్యూరియాసిటీ అంతా ఇంతా కాదు. అందుకే దేశవ్యాప్తంగా ఈ సినిమా సాధించిన తొలి రోజు వసూళ్లు కొత్త రికార్డు సృష్టించాయి. ఏకంగా 34.75 కోట్లు వసూళ్లు కొల్లగొట్టి తొలి స్థానాన్ని ఆక్రమించింది 'సంజూ'. రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్‌, మనీషా కోయిరాల, అనుష్క, టబు, సోనమ్‌ కపూర్‌ తదితరులు ఇతర ప్రధాన తారాగణంగా నటించారు. 

విడుదలకు ముందు పలు వివాదాల్లో చిక్కుకున్నా, విడుదలయ్యాక సినిమా ఆశించిన విజయాన్ని అందుకోవడంలో తొలి రోజే సక్సెస్‌ అయ్యింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సంజయ్‌దత్‌ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కింది 'సంజూ'. సంజయ్‌ దత్‌ పాత్రలో రణ్‌వీర్‌ కపూర్‌ పరకాయ ప్రవేశం చేశాడు. తనను తాను సంజయ్‌దత్‌లా మేకోవర్‌ చేసుకున్న విధానం అందర్నీ ఆకట్టుకుంటోంది. 

తొలి రోజే ఈ స్థాయిలో రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రం ఇక ముందు ముందు ఇంకెంత వసూళ్ల సునామీ సృష్టించనుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS