యాంకర్, నటి అనసూయకి అభిమానులు ఎందరు ఉంటారో దాదాపు అదే స్థాయిలో ఆమెని విమర్శించే వారు ఉండటం కాస్త ఆసక్తి కలిగించే అంశం. ఇందుకు ఉదాహరణ ఆమె ట్విట్టర్ ఖాతా ఒకసారి గమనిస్తే మనకి తెలిసిపోతుంది.
ఆమె ఏమి ట్వీట్ చేసినా అది ఒక చిన్నపాటి సంచలనమే అవుతుంది అని అన్నది నిర్వివాదాంశం. ఇక ఆమె నిన్న చేసిన ఒక పోస్ట్ మళ్ళీ ఆమెని వివాదాల్లోకి లాగింది. అసలు జరిగిందేంటంటే- నిన్న హైదరాబాద్ లో ఆమె తన కారు లో ప్రయాణిస్తున్న సమయంలో ఆమె పక్కన ఉన్న కారులో వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ లో సినిమా చూస్తున్న దానిని తన మొబైల్ లో రికార్డు చేసి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకి ట్విట్టర్ ద్వారా పంపింది.
ఇలా సినిమా చూస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది అంటూ తగు చర్యలు తీసుకోండి అంటూ ఆమె కోరింది. దీనికి ఆమెకి మద్దతుగా కొంతమంది ఆమెని అభినందించగా మరికొంతమంది మాత్రం మీరు మీ కారు నుండి అతనికి అలా చేయకూడదు అని చెప్తే సరిపోద్ది అలా కాకుండా ఇలా ట్రాఫిక్ పోలీసులకి ఇస్తే అతని లైసెన్స్ రద్దవుతుంది అని కొందరు చెప్పగా
ఇంకొంతమంది మాత్రం నువ్వు ఆ వీడియో తీస్తున్న సమయంలో నువ్వు కూడా డ్రైవింగ్ చేస్తున్నావా అంటూ సెటైర్లు వేశారు.
వీటన్నిటికి ఆమె తనదైన శైలిలో కౌంటర్లు ఇవ్వడం దీనితో చిన్న అంశం కాస్తా అదొక పెద్ద రచ్చగా మారిపోయింది. ఇది చాలా చిన్న విషయమే అని అందరికి కనిపిస్తున్నా అనసూయ మరియు ఆమెని వ్యతిరేకించే వారు మాత్రం చాలా పెద్ద అంశంగా మార్చారు అని చెప్పొచ్చు.