ప్రముఖ యాంకర్ అనసూయ ఈ మధ్యనే బుల్లితెర నుండి వెండితెరకు బంపర్ ఎంట్రీ ఇచ్చింది.
ఇక క్షణం చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ తరుణంలో ఆమెకి ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డుకి నామినేట్ అయింది. ఇక నామినేట్ అయిన ప్రతి ఒక్కరికి ఫిలింఫేర్ నుండి ప్రత్యేకంగా ఇన్విటేషన్ వస్తుంది.
కాని అనసూయకి మాత్రం ఈ ఇన్విటేషన్ రాలేదు. దీనితో ఆమె ఆ అవార్డ్స్ ఈవెంట్ కి వెళ్ళలేదు. ఇలాంటి అనుభవమే నటుడు అడివి శేష్ కి కూడా జరిగింది. అయితే అడివి శేష్ కి మాత్రం ఆ అవార్డ్స్ ఈవెంట్ మొదలయ్యే గంట ముందు ఫిలింఫేర్ అవార్డ్స్ నుండి ఇన్విటేషన్ పంపనందుకు క్షమాపణ అడుగుతూ మెసేజ్ పెట్టారట.
ఈ విషయాన్ని అడివి శేష్ తన ట్విట్టర్ అకౌంట్ లో పెట్టగా, అనసూయ తనకి జరిగిన అనుభవం గురించి చెప్పుకొచ్చింది. మొత్తానికి అనసూయకి పెద్ద అవమానం జరిగిందంటూ ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.