సునీల్ ఇప్పుడు మళ్లీ హీరోగా బిజీ అవుతున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూనే, హీరోయిజం చూపిస్తున్నాడు. ఇటీవలే తన కొత్త సినిమా `వేదాంతం రాఘవయ్య` పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. చంద్రమోహన్ దర్శకుడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని టాక్. ఓ హీరోయిన్ గా పూర్ణని ఎంపిక చేసినట్టు సమాచారం.
మరో హీరోయిన్ పాత్ర కోసం అనసూయని ఎంచుకున్నార్ట. కథనం లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అనసూయ కథానాయికగా నటించింది.రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో మాత్రం హీరోయిన్ గా చేయలేదు. ఎట్టకేలకు.. అనసూయకి ఆ అవకాశం వచ్చినట్టైంది. పూర్ణది కూడా హీరోయిన్ టైపు పాత్రనా? లేదంటే కీలకమైన పాత్రా? అనే విషయంలో సందిగ్థం నెలకొంది. ఈ ఇద్దరిలో ఒకరు మాత్రం హీరోయిన్ గా నటించడం ఖాయం.