'రంగస్థలం' సినిమాలోని 'రంగమ్మత్త' ఎవరో ఇప్పటికే తెలిసిపోయింది. 'నేను అత్తని కాదు మొర్రో..' అని బుకాయించేందుకు ఇన్నాళ్ళూ ప్రయత్నించిందిగానీ, విషయం రివీల్ అయిపోయాక బుల్లితెర బ్యూటీ అనసూయ ఆ విషయాన్ని ఒప్పుకోక తప్పలేదు. అయితే 'రంగమ్మత్త' అంటే 'అత్త' కానే కాదని అంటోంది. ఊళ్ళో 'అత్త' అన్న మాట చాలా తేలిగ్గా వాడేస్తుండేవారు ఒకప్పుడు.
1985 నాటి సినిమా కదా! అలా ఈ 'అత్త' కూడా ఆనాటి పరిస్థితుల నేపథ్యంలో దర్శకుడు తీర్చిదిద్దిన ఓ పాత్ర మాత్రమేనట. పాత్ర తీరు తెన్నులోంటే ఇంకా తెలియరాలేదు. కొన్నాళ్ళ క్రితం తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అనసూయ ఓ ఫొటో రిలీజ్ చేసిందంతే. అందులోనూ ఆమె ఫేస్ కన్పించలేదాయె. దాంతో 'రంగమ్మత్త' ఎలా వుండబోతోందన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. 1985 నాటి ఊరు అంటే, అందులో చాలా చాలా విశేషాలుంటాయి.
'పుల్లట్లు వేసే పుల్లమ్మ' దగ్గర్నుంచి, వరిచేలో పనులు చేసే మల్లమ్మదాక ఎన్నెన్ని పాత్రలని ఊహింగచలం? అందులో 'రంగమ్మత్త' పాత్ర ఏంటంటే, ఎలా చెప్పగలం? 'రంగమ్మత్త' పాత్ర సర్‌ప్రైజింగ్‌గా వుంటుందని మాత్రమే ఇన్‌సైడ్ సోర్సెస్ నుంచి సమాచారం అందుతోంది. ఆ సర్‌ప్రైజ్ ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగక తప్పదు.
'చరణ్‌కి అత్తగా నటిస్తోంది' అన్న మాటల్ని కొట్టేసిందిగానీ, చరణ్‌తోపాటు అందరికీ 'అత్త'నయ్యానంటూ ఒప్పేసుకుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో సుకుమార్, 'అనసూయ'ని 'రంగమ్మత్త' పాత్రలో చూపించడం కష్టమయ్యిందనీ, దానిక్కారణం ఆమె యంగ్ లుక్ అనీ చెప్పాడంటే, అంతకంటే బెస్ట్ కాంప్లిమెంట్ అనసూయకి ఇంకేముంటుంది?