ఈవారం విడుదలైన రెండు ప్రముఖ చిత్రాలలో ఒకటి కన్నడలో హిట్ అయిన చిత్రానికి రీమేక్ కాగా మరొకటి ఒక తమిళ డబ్బింగ్ చిత్రం.
ముందుగా కన్నడలో విజయం సాధించిన కిరిక్ పార్టీ ని తెలుగులోకి కిరాక్ పార్టీ గా రూపొందించడం జరిగింది. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ తన నాలుగేళ్ళ కాలేజీ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల కలపోతనే ఈ చిత్రం. యంగ్ హీరో నిఖిల్ ఈ చిత్రంలో రెండు పాత్రల్లో చాలా చక్కగా నటించాడు, రెండు పాత్రలకి వైవిధ్యం చూపెట్టడంలో విజయం సాధించాడు.
అయితే ఈ చిత్రం మాత్రం కన్నడలో వచ్చిన కిరిక్ పార్టీ తో పోలిస్తే అంత బాగా లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కలెక్షన్స్ పరంగా చూస్తే సినిమా డీసెంట్ టాక్ సొంతం చేసుకున్నట్టే అనిపిస్తున్నా మూడు నాలుగు రోజులు అయితే కాని ఈ సినిమా గురించి చెప్పలేం.
ఇక తమిళ డబ్బింగ్ చిత్రం అయిన కర్తవ్యం గురించి మాట్లాడుకుందాం. ఒకప్పట్టి విజయశాంతి నటించిన కర్తవ్యంతో ఈ చిత్రానికి ఎటువంటి పోలిక లేకపోయినప్పటికీ రెండు చిత్రాల కథలు స్త్రీ పాత్ర చుట్టూనే తిరుగుతాయి.
ఇందులో ప్రధానపాత్రలో కనిపించిన నయనతార ఒక పవర్ ఫుల్ అయిన ప్రభుత్వ అధికారిగా అధ్బుతంగా నటించింది అనే చెప్పాలి. బోరుబావిలో పడిపోయిన చిన్నారిని కాపాడే ప్రయత్నంలో ఒక అధికారిగా ఆమె పలికించిన అభినయం అభినందనీయం. ముఖ్యంగా ఈ చిత్ర దర్శకుడు అయిన గోపీ నయనార్ ఎంత పొగిడినా తక్కువే. కారణం- ఇటువంటి ఒక వాస్తవిక కథని ఆధారం చేసుకుని ఒక సినిమా తీయడం అలాగే దానిని అందరికి నచ్చేలా తీయడం సామాన్య విషయం కాదు. ఈ సినిమా కచ్చితంగా ఒక మంచి చిత్రంగా మిగిలిపోనుంది.
ఇది ఈ వారం విడుదలైన చిత్రాల గురించిన టాక్ అఫ్ ది వీక్.