సూయ సూయ 'రంగమ్మత్త' మాయ

మరిన్ని వార్తలు

బుల్లితెర హాటెస్ట్‌ యాంకర్‌ అనసూయ అందం అంతకంతకూ పెరిగిపోతోందంటే నమ్మి తీరాల్సిందే. తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ ఫోటో చూస్తే మీకే అర్ధమవుతుంది. ఆనసూయ సొగసు చూడతరమా! అనిపిస్తుంది. 

అల్ట్రా మోడ్రన్‌లో చీరకట్టు, అందుకు ట్రెండీ మేచింగ్‌ బ్లౌవుజు... కాస్ట్యూమ్‌ పరంగా సో హాట్‌ లుక్‌లో కనిపిస్తున్న అనసూయ ఈ ఫోటోకి ఇచ్చిన పోజుకి కుర్రకారు చూపు తిప్పుకోలేకపోతున్నారు. నడుం మీద చేయి, శంఖం లాంటి మెడవంపు, పక్కకి తిరిగి చూస్తున్న చూపులు ఓ అందమైన శిల్పంలా కనిపిస్తోంది. బుల్లితెరపై ఈ రేంజ్‌లో హాట్‌నెస్‌ ప్రదర్శిస్తూనే వెండితెరపై యాక్టింగ్‌ టాలెంట్‌తో ఆకట్టుకుంటోంది అనసూయ. నాగార్జునకు మరదలుగా నటించి, 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాతో మాస్‌ దృష్టిని ఆకర్షించింది. అలాగే 'క్షణం'లో పవర్‌ ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో నెగిటివ్‌ షేడ్స్‌ని ప్రదర్శించి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

తాజాగా అనసూయ నటిస్తున్న చిత్రం 'రంగస్థలం'. ఈ సినిమాలో అనసూయ రంగమ్మత్త పాత్రలో కనిపించనుందనీ సమాచారమ్‌. అయితే మొదట్లో చరణ్‌కి అత్త పాత్రలో అనసూయ నటిస్తోందంటూ వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ గాసిప్స్‌ మాత్రమే అని అనసూయ ఖండించింది. అయితే 1985 కాలం నాటి పల్లెటూరి పరిస్థితులను తెరపై చూపిస్తున్నారు ఈ సినిమాలో డైరెక్టర్‌ సుకుమార్‌. ఆ కాలంలో పల్లెటూరి పద్ధతులు, పడికట్లు, పిలుపులు .. ఇలా పలు అంశాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది చిత్ర యూనిట్‌. 

చుట్టాలు, బంధువులే కాకుండా, ఇరుగు పొరుగు వారితో కూడా వరసలు కలిపి మాట్లాడుకోవడం ఆ కాలంలో పరిపాటి. అలా అనసూయ పక్కింటి 'రంగమ్మత్త' పాత్రలో కనిపించనుందట. కానీ ఆ పాత్ర సినిమాలో అత్యంత కీలకమట. అనసూయ సినీ కెరీర్‌లోనే ఈ క్యారెక్టర్‌ ది బెస్ట్‌ క్యారెక్టర్‌గా నిలిచిపోనుందని సినీ వర్గాల్లో వినిపిస్తోన్న మాట. మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS