కరోనా కారణంగా ‘లాక్‌డౌన్’పై రెస్పాండ్ అయిన అనసూయని నెటిజన్స్ ఆడేసుకుంటున్న నేపథ్యంలో, ఒక్కొక్కరికీ సమాధానం చెప్పేందుకు వేళ్లు నొప్పులేసి, డైరెక్ట్‌గా లైవ్‌లోకి వచ్చింది. తనకు తోచిన విధంగా మాట్లాడుతూ, అందరి ప్రశ్నలకూ సమాధానమిచ్చింది. ఆ క్రమంలోనే తనపై అనవసరంగా కామెంట్ చేస్తున్నారనీ, అయినా నా లైఫ్ నా ఇష్టం అంటూ ఏదేదో మాట్లాడింది. అలాగే, మధ్య మధ్యలో నాకూ సామాజిక బాధ్యత ఉందంటోంది.
ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను కాబట్టి, ఏదో ఒక రకంగా కాలక్షేపం చేయాలి కాబట్టి ఇలా చేస్తున్నా.. అంటోంది. ఎంత ఖాళీగా కూర్చున్నా సామాజిక బాధ్యత అంటే ఇదేనా.? అని మరోవైపు ఒళ్లు మండిపోయి నెటిజన్లు అనసూయని ఇంకా దారుణంగా కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్స్‌నీ ఎంజాయ్ చేస్తోంది. తనకు తోచినట్లు తానూ రీ కామెంట్స్ చేస్తోంది. మొత్తానికి కరోనా విరామాన్ని అనసూయ ఇలా వాడేసుకుంటోందన్న మాట. ఖర్మరా బాబూ.. ఓ వైపు కరోనా వచ్చి జనం అలా సస్తుంటే, ఎవరి గోల వాడిది అన్నట్లుగా అనసూయ ఇలా టైమ్ అంతా సోషల్ మీడియాకే కేటాయిస్తూ, నెటిజన్స్‌తో ఆడుకుంటూ, ఆడిరచుకుంటున్నట్లు కనిపిస్తోంది.