అనసూయా.. అన్నీ గుసగుసలేనా.?

మరిన్ని వార్తలు

క్రేజీ యాంకర్‌ కమ్‌ యాక్ట్రెస్‌ అనసూయపై వచ్చే గుసగుసలు అన్నీ ఇన్నీ కావు. క్రేజ్‌ అంటే ఇదేనేమో మరి. ఏదో ఒక హాట్‌ టాపిక్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలవాలనుకునే అనసూయకు సినిమా అవకాశాలపై ఈ మధ్య ప్రచారాలు బాగా ఎక్కువయ్యాయి. ‘రంగస్థలం’ సినిమాతో వెండితెరపై అనసూయ ఇమేజ్‌ పెరిగిందనడం అతిశయోక్తి కాదేమో కానీ, ఆ ఇమేజ్‌ని కంటిన్యూ చేయగల అలాంటి మరో క్యారెక్టర్‌ అనసూయ దక్కించుకోలేకపోయిందనడం వాస్తవం. స్పెషల్‌ సాంగ్స్‌లో, నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్స్‌లో.. ఓ మోస్తరు ఇంపార్టెంట్‌ రోల్స్‌.. ఇలా బహు వేరియేషన్స్‌ ఉన్న క్యారెక్టర్స్‌ పోషించేసిన అనసూయ ప్రస్తుతం సుకుమార్‌ సినిమాలో మళ్లీ నటిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

 

సుకుమార్‌ ` బన్నీ కాంబోలో తెరకెక్కే సినిమాలో అనసూయకు ఓ బెస్ట్‌ ఛాన్స్‌ దక్కిందని మాట్లాడుకుంటున్నారు. కానీ, ఈ విషయంలో అధికారిక ప్రకటన అయితే రాలేదింతవరకూ. అలాగే, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ సినిమాలోనూ అనసూయ నటిస్తోందట. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సినిమాలోనూ అనసూయ కనిపించనుందట.. అంటూ మెగా కాంపౌండ్‌ ప్యాకేజ్డ్‌ న్యూస్‌ అనసూయ చుట్టూ గుప్పుమంటున్నాయి. అయితే, వీటిలో అనసూయ అసలు దక్కించుకున్న ఛాన్స్‌స్ ఏంటో తెలీదు కానీ, ఈ గుసగుసల్ని అనసూయ మాత్రం భలే ఎంజాయ్‌ చేస్తుంటుంది. ఆ ఎంజాయ్‌మెంట్‌లో మునిగి తేలుతూనే, బుల్లితెరపై తన పని తాను చేసుకుపోతుంటుంది అందాల అనసూయ. అసలింతకీ ఈ గుసగుసల్లో ఎన్ని నిజాలున్నాయో.? అని తెలుసుకునేందుకు ఫ్యాన్స్‌ తహతహలాడిపోతున్నారు. ఆ తహ తహ తీరాలంటే అనసూయ నుండి క్లారిటీ రావాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS