‘ముకుంద’కు లైనేస్తోన్న వెంకీ డైరెక్టర్‌.. నిజమేనా.?

మరిన్ని వార్తలు

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సూపర్‌ హిట్స్‌ అందించిన ఈయన కెరీర్‌లో ‘బ్రహ్మోత్సవం’ డిజాస్టర్‌గా మిగిలిన సంగతి తెలిసిందే. ఓ ఐడియా జీవితాన్ని మార్చేసినట్లు, ఒక్క ఫ్లాప్‌ ఈ దర్శకుడి కెరీర్ని దెబ్బ తీసేసింది. ‘బ్రహ్మోత్సవం’ సినిమా తర్వాత శ్రీకాంత్‌ అడ్డాలను బొత్తిగా పట్టించుకోవడం మానేశారు మన హీరోలు, నిర్మాతలు. అయితే, శ్రీకాంత్‌ అడ్డాలను నమ్మి తాజాగా విక్టరీ వెంకటేష్‌ ‘అసురన్‌’ రీమేక్‌ అప్పగించడంతో, మళ్లీ ఇండస్ట్రీ దృష్టి ఆయనపై మళ్లిందంటున్నారు. విక్టరీ వెంకటేష్‌ నటిస్తున్న ‘అసురన్‌’ రీమేక్‌ తెలుగులో ‘నారప్ప’గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు తన హోమ్‌ బ్యానర్‌లో ఈ సినిమాని ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నారు.

 

ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా అవుట్‌ పుట్‌ అద్భుతంగా వస్తోందని మాట్లాడుకుంటున్నారు. ప్రియమణి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా శ్రీకాంత్‌ అడ్డాల ఖాతాలో ఓ మెగా ప్రాజెక్ట్‌ పడనుందనే గుసగుస ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ‘బాక్సర్‌’ సినిమాలో నటిస్తున్న వరుణ్‌ తేజ్‌, తదుపరి చిత్రం శ్రీకాంత్‌ అడ్డాలతో ఉండబోతోందనేది ఆ గుసగుస. ఈ మధ్యనే వరుణ్‌కి ఓ స్టోరీ లైన్‌ వినిపించాడట శ్రీకాంత్‌ అడ్డాల. ఆ స్టోరీ పట్ల వరుణ్‌ సుముఖంగా ఉన్నాడనీ తెలుస్తోంది. సో త్వరలోనే ఈ కాంబో సెట్‌ అయ్యేలా ఉందని అంటున్నారు. మరి, తొలి సినిమాకే హీరోగా వరుణ్‌ తేజ్‌లోని భిన్న యాంగిల్స్‌ని బ్రిలియంట్‌ వేలో చూపించిన టాలెంట్‌ శ్రీకాంత్‌ అడ్డాలది.

 

ఇక ఇప్పుడు హీరోగా చాలా అనుభవం సంపాదించేశాడు వరుణ్‌. అలాంటి వరుణ్‌ని శ్రీకాంత్‌ అడ్డాల ఇప్పుడికెలా చూపించబోతున్నాడో చూడాంటే, అసలింతకీ ఈ గుసగుస నిజమేనా.? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS