ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఆ హీరరోయిన్ మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతోంది. బాలనటిగానే బోలెడంత మంది అభిమానుల్ని సంపాదించుకుంది. బాలనటిగానే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. హీరోయిన్‌గా తొలిసారి కనిపించింది తెలుగు తెరపైనే. ఆమె ఎవరో కాదు 'ఓయ్' బ్యూటీ షామిలీ.
తొలి సినిమా నిరాశపరచడంతో ఉన్నత చదువులు కోసం కెరీర్‌కి దూరమైంది. తర్వాత ఓ మలయాళ, ఓ తమిళ సినిమా చేసిన షాలినీ మరోసారి తెలుగు తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యింది. తెలుగులో షాలినీ హీరోయిన్‌గా 'అమ్మమ్మగారిల్లు' చిత్రం తెరకెక్కుతోంది. నాగ శౌర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ షామిలీగా ముద్దు ముద్దు మాటలతో అలరించిన ఈ క్యూటీ హీరోయిన్‌గా తొలి సినిమాలోనూ కొంచెం బొద్దుగానే కనిపించింది. అయితే నటన పరంగా బరువైన పాత్ర పోషించి, మంచి మార్కులే కొట్టేసింది.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన అనుభవం, తొలి సినిమాలో వెయిట్ ఉన్న పాత్రకి బాగా ఉపకరించింది షామిలీకి. తాజాగా తెరకెక్కుతోన్న చిత్రం టైటిల్‌ని బట్టి చూస్తే చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనిపిస్తోంది. 'అమ్మమ్మగారిల్లు' అనే టైటిల్ చాలా క్యాచీగా ఉంది. అమ్మమ్మగారింటితో ప్రతీ ఒక్కరికీ ఉండే అనుబంధం ప్రత్యేకం. అలాంటిది ఈ తరహా టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో షామిలీ బ్యూటీ పాత్ర ఎలా ఉండబోతోందో చూడాలి మరి. వేసవిలో ఈ సినిమాని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.