సినీతారలకి ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉంటాయో అంతే స్థాయిలో చిక్కులు కూడా ఉంటాయి. ముఖ్యంగా కొందరు పిచ్చి అభిమానుల వల్ల ఎదురయ్యే ఇబ్బందులు వర్ణనాతీతం.
ఇటువంటిదే ఒక సంఘటన తాజాగా ఐశ్వర్య రాయి బచ్చన్ కి సంబందించే తాజాగా జరిగింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంగీత కుమార్ అనే 29 ఏండ్ల యువకుడు ముంబై చేరుకొని తన కన్నతల్లి ఐశ్వర్య రాయి అని చెప్పడం అందరిని షాక్ కి గురిచేసింది.
తాను 1988లో ఐశ్వర్య రాయి కి లండన్ లో IVF పద్ధతి ద్వారా జన్మించినట్టు చెబుతున్నాడు. ఆ తరువాత తనని తన తల్లి అయిన ఐశ్వర్య నుండి వేరు చేసి ఆంధ్రప్రదేశ్ కి తీసుకోచ్చేశారు అని చెబుతుండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.
అతను చెబుతున్న మాటల ప్రకారం, ఐశ్వర్య రాయికి 15 ఏండ్ల వయసు ఉన్నప్పుడే ఇతనికి జన్మనిచ్చినట్టు! ఈ వార్తలు విన్న ఎవ్వరు కూడా వీటిని నమ్మే పరిస్థితి లేదు అన్నది వాస్తవం. అలాగే ఇతనికి మానసిక స్థితి కూడా లేదు అన్నది నూటికి నూరుశాతం చెప్పొచ్చు.
ఇటువంటి వాళ్ళతో ఎప్పటికైనా సినీతారలకి తిప్పలే..