బుల్లితెరపై వన్ ఆఫ్ ది ఎనర్జిటిక్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు. ఈ మధ్య ప్రదీప్ బుల్లితెరపై కనిపించడం లేదు. అందుకు కారణం ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడనీ, ప్రదీప్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే, ఈ గాసిప్స్ ఈ మధ్య మరీ శృతి మించిపోయాయి. దాంతో ఎట్టకేలకు ప్రదీప్ రెస్పాండ్ అయ్యాడు. ఓ లైవ్ వీడియో ద్వారా ఫ్యాన్స్‌కి అసలు విషయం కన్‌వే చేశాడు.
అనారోగ్యం కారణంగా బ్రేక్ తీసుకున్న మాట వాస్తవమే కానీ, మరీ అంత సివియర్ హెల్త్ ప్రాబ్లెమ్ కాదనీ, షూటింగ్‌లో జరిగిన ఓ చిన్న యాక్సిడెంట్ కారణంగా కాలికి గాయం తగలడంతో, ఎక్కువగా నిలబడొద్దన్న డాక్టర్ల సూచనతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నానంతే. త్వరలోనే మళ్లీ షూటింగ్‌లో జాయిన్ అవుతా.. ఫ్యాన్స్ కంగారు పడొద్దు అని ప్రదీప్ చెప్పాడు. అయితే, ఈ గ్యాప్‌లో తనపై వచ్చిన రూమర్స్‌ని, యూట్యూబ్ ఛానెల్స్‌లో చూసి చాలా ఎంజాయ్ చేశాననీ, బుల్లితెరపై తన కారణంగా పుట్టిన ఎంటర్‌టైన్‌మెంట్ కంటే, ఈ గాసిప్స్ వల్ల పుట్టే కామెడీ చాలా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉందనీ, వీటిని ఎంజాయ్ చేస్తూ, అస్సలు బోరే కొట్టకుండా ఇన్ని రోజులు గడిచిపోయాయన్నాడు ప్రదీప్.
మరోవైపు ఎప్పుడూ షూటింగ్స్‌తో బిజీగా ఉండే ప్రదీప్‌కి ఈ రెస్ట్ కారణంగా లాంగ్ గ్యాప్ తర్వాత తన పుట్టినరోజు, దీపావళి పండుగలు ఫ్యామిలీతో కలిసి ఆనందంగా జరుపుకునే అవకాశమొచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.