నందమూరి హీరో కళ్యాణ్‌రామ్ '118' తర్వాత నటిస్తున్న చిత్రం 'ఎంత మంచి వాడవురా'. సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల విడుదల చేసిన టీజర్ ఆహ్లాదకరంగా అన్ని వర్గాల్ని ఆకట్టుకునేలా ఉంది. హీరో మంచితనాన్ని ఎలివేట్ చేస్తూ, ఈ మంచోడితో ఎంత మంచిగా ఉంటే అంత మంచిది. చెడుగా భావిస్తే, ఉతుకుడే.. అని హీరో ఇంట్రడక్షన్ చూపించారు ఈ టీజర్‌లో. ఇక ఈ సినిమాని సంక్రాంతికి విడుదల కానున్న రెండు పెద్ద సినిమాలకు ధీటైన పోటీగా బరిలోకి దించారు. ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే కానీ, అంత సాహసం చేయలేరు. సో ఈ సినిమా విజయంపై చాలా నమ్మకంగా ఉన్నాడట కళ్యాణ్‌రామ్. అందులోనూ ఓ హిట్ కొట్టి మంచి జోరుమీదున్నాడు. ఆ జోరు కంటిన్యూ చేయాలంటే, ఇలాంటి సాహసమేదో చేయాల్సిందే.
ఇకపోతే, ఈ సినిమాలో హీరోయిన్‌గా మెహ్రీన్ నటిస్తుండగా, ఓ కీలక పాత్రలో సీనియర్ నటి సుహాసిని నటిస్తున్నారు. సుహాసిని తనకిచ్చిన పాత్ర నిడివితో సంబంధం లేకుండానే ఏ రేంజ్‌లో ఎలివేట్ చేసుకుంటారో చాలా సినిమాల్లో చూసేశాం. కానీ, ఈ సినిమాలో సుహాసిని పాత్ర గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుందంటున్నారు. అరత ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తున్న సుహాసినికీ, మన మంచోడు హీరోకీ మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ ఉందో తెలియాలంటే, సినిమా చూడాల్సిందే.