ప్రస్తుత రాజకీయాల్లో ప్రజలు కోరుకుంటున్న మార్పు రావాలంటే అది కేవలం పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యం అవుతుందని ఆశిస్తున్నా.. అని తెలిపింది బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ. బుల్లితెరపై తన హాట్ హాట్ అందాలతో కనువిందు చేసే రష్మీ వెండితెరపైనా తనదైన శైలిలో హీరోయిన్‌గా గ్లామర్ ఒలకబోస్తూ సత్తా చాటుతోంది. క్రిస్‌మస్ సందర్భంగా రష్మీ అభిమానులతో చిట్‌చాట్ చేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ముద్దుగా కాస్త ఫన్నీగా సమాధానమిచ్చింది.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్‌పై రష్మీ స్పందించిన తీరుకు, సోషల్ మీడియాలో పవన్ అభిమానుల నుండి రెస్పాన్స్ అదిరిపోతోంది. పెళ్లి గురించి అడిగితే సమాధానం చెప్పడం తనకిష్టం లేదంటోంది. హారర్ సినిమాలకి బ్రాండ్ అంబాసిడర్ అని పేరు తెచ్చుకున్న రష్మీ ప్రస్తుతం సినిమాలేం చేయట్లేదు. సుడిగాలి సుధీర్ హీరోగా సినిమా ఎవరైనా చేస్తే, ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు తాను సిద్ధం అని ఫన్నీగా చెప్పింది.
ఇష్టమైన రెసిపీ ఏంటని అడిగితే హైద్రాబాద్‌లో ఉంటున్న వారి నుండి ఠక్కున వచ్చే సమాధానం హైద్రాబాదీ బిర్యానీ అని. కానీ మన వైజాగ్ పాప రష్మీ ఏం చెప్పిందో తెలుసా.? ఆంధ్రా స్పెషల్ పచ్చిపులుసు అంటే తనకెంతో ఇష్టమనీ ఆన్సర్ ఇచ్చింది. సినిమాల్లో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలొచ్చినా ఈటీవీ జబర్దస్త్‌ని మాత్రం వదలనని రష్మీ చెప్పింది.