హద్దులు దాటేసిన యాంకర్‌ వర్షిణి.

By Inkmantra - December 07, 2019 - 13:47 PM IST

మరిన్ని వార్తలు

బుల్లితెరపై రకరకాల 'షోలు' యాంకర్లకు బోల్డంత మైలేజ్‌ తెచ్చిపెడుతున్నాయి. మరి, ఆయా షోలకు తమ గ్లామర్‌ అద్దేందుకు యాంకర్లూ తమవంతు కృషి చేయాలి కదా.! పటాస్‌ అనే షోకి యాంకర్‌గా పనిచేస్తున్న వర్షిణి ఇటీవలి ఎపిసోడ్‌లో చేసిన పని ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఓ టీనేజర్‌ బుగ్గని రొమాంటిక్‌గా కొరికేసింది వర్షిణి. ఊహించని ఈ ఘటనతో ఆ టీనేజర్‌ మాత్రమే కాదు, షో చూస్తున్నవారంతా షాక్‌కి గురయ్యారు. ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్స్‌లో భాగమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.

 

సుధీర్‌ - రష్మిల ప్రేమ వ్యవహారం కూడా అంతే. ఆ ఇద్దరి మధ్యా ఏమీ లేకపోయినా, ఏదో వుందంటూ వాళ్ళిద్దరే చాలా కామెడీ స్పూఫ్‌లు చేశారు.. పెళ్ళి తంతు.. పేరుతో కొన్ని స్పెషల్‌ షోస్‌ కూడా చేసేశారు. ఈ తరహా పబ్లిసిటీ స్టంట్స్‌లో వర్షిణి కొరుకుడు 'పీక్స్‌'గా చెప్పుకోవచ్చేమో. వెండితెరపై లిప్‌ టు లిప్‌ కిస్‌లు సర్వసాధారణమే. ఏమో, ముందు ముందు బుల్లితెరపైనా అలాంటివి చూడబోతున్నామేమో.

 

అయినా, ఏం చేసినా అది నటనలో భాగమేనని కవర్‌ చేసుకోవడానికి అందాల భామలకు ఓ ఛాన్స్‌ ఎప్పుడూ అందుబాటులో వుంటుందనుకోండి.. వర్షిణి కూడా అలాంటి ఓ 'సాకు' వెతుక్కునే, ఈ పబ్లిసిటీ స్టంట్‌ చేసి వుండొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS