అనసూయ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన యాంకర్ వర్షిణి

మరిన్ని వార్తలు

ఒక్కోసారి అస‌లు కంటే కొస‌రే బాగుంటుంది. జబర్ధస్త్ షో చూసిన వాళ్లంద‌రికీ ఇది అనుభ‌వంలోకి వ‌చ్చిన మాటే. ఎందుకంటే... అందులో కామెడీ కంటే, పంచ్‌ల కంటే.. యాంక‌ర్ భామ‌ల గ్లామ‌ర్ త‌ళుకులు, రోజా - నాగ‌బాబుల న‌వ్వులే హైలెట్‌గా క‌నిపిస్తుంటాయి.  జబర్ధస్త్ షోకే... అందం తీసుకొచ్చింది అన‌సూయ‌. ఆమె కోస‌మే ఈ షో ఫాలో అయ్యేకుర్ర‌కారు ఉందంటే ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. అలాంటి అన‌సూయ‌కే షాకిచ్చింది మ‌రో యాంక‌ర్ పాప‌. ఇప్పుడు ఆమె వ‌ల్ల‌...జబర్ధస్త్ లో అన‌సూయ స్థాన‌మే ప్ర‌మాదంలో ప‌డింది.

ఈమ‌ధ్య జ‌బ‌ర్‌ద‌స్త్ షోలో అన‌సూయ క‌నిపించ‌డం లేదు. త‌న వ్య‌క్తిగ‌త ప‌నుల వ‌ల్ల‌.. కొన్ని రోజులు ఈ షోకి దూర‌మైంది అన‌సూయ‌. ఆమె స్థానంలో వ‌ర్షిణిని తీసుకొచ్చింది మ‌ల్లెమాల టీమ్‌. అన‌సూయ‌ని చూసిన క‌ళ్ల‌తో వ‌ర్షిణిని ఏం చూస్తాంలే అనుకుంటే... వ‌ర్షిణి త‌న వాక్ చాతుర్యంతో అద‌ర‌గొట్ట‌డం మొద‌లెట్టింది. షో.. షోకి త‌న ఈజ్ పెంచుకుంటూ పోయింది. దాంతో వ‌ర్షిణికి మంచి మార్కులు ప‌డ్డాయి. ఇప్పుడు `అన‌సూయ కంటే వ‌ర్షిణినే బెట‌రేమో` అన్న అభిప్రాయానికి వ‌చ్చేసింది జ‌బ‌ర్‌ద‌స్త్ టీమ్‌.

దానికీ ఓ కార‌ణం ఉంది. అన‌సూయ వ‌రుస సినిమాల‌తో, షెడ్యూళ్ల‌తో బిజీగా ఉంటోంది. ఆమె పారితోషికం కూడా ఎక్కువే. ఆమె స్థానంలో వ‌ర్షిణిని తీసుకుంటే.. త‌మ‌కే లాభ‌సాటిగా ఉంటుంద‌న్న‌ది జ‌బ‌ర్‌ద‌స్త్ టీమ్ అభిప్రాయం. ఇంకొన్ని రోజులు వ‌ర్షిణి జోరు గ‌మ‌నించి అప్పుడు నిర్ణ‌యం తీసుకోవాల‌ని యాజ‌మాన్యం భావిస్తోంద‌ట‌. మొత్తానికి కొస‌రు యాంక‌రుగా వ‌చ్చి..అస‌లు యాంక‌ర్‌కే ఎస‌రు పెట్టేసింది వ‌ర్షిణి. మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS