గ్లామ్‌షాట్‌: హాట్‌ అండ్‌ స్పైసీ ఆండ్రియా అదిరిందయా.!

By iQlikMovies - April 13, 2018 - 17:59 PM IST

మరిన్ని వార్తలు

సునీల్‌, నాగచైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కిన 'తడాఖా' చిత్రంలో తమన్నాతో పాటు, ఆండ్రియా కూడా ఓ హీరోయిన్‌గా నటించింది. 'యుగానికి ఒక్కడు', 'చంద్రకళ' వంటి పలు డబ్బింగ్‌ చిత్రాలతోనూ ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. కేవలం నటన మాత్రమే కాదు, అమ్మడు మల్టీ టాలెంటెడ్‌. సింగర్‌, మంచి డాన్సర్‌ కూడా.

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న 'భరత్‌ అనే నేను' సినిమాలో ఆండ్రియా తన గొంతు వినిపించింది. అంటే ఓ పాట పాడిందన్న మాట. 'అరెరె ఇది కలలా ఉన్నదే.. ' అనే జోష్‌ సాంగ్‌ పాడి కుర్రోళ్ల మనసు గెలచుకుంది. అలాగే హాట్‌నెస్‌లో కూడా అమ్మడికి బోలెడంత మంది ఫ్యాన్స్‌ ఉన్నారండోయ్‌. ఎక్స్‌పోజింగ్‌కి అస్సలు వెనుకాడదు ఈ బ్యూటీ.

ఈ మధ్య సిద్దార్ద్‌ హీరోగా వచ్చిన హారర్‌ చిత్రం 'గృహం'లో బోల్డ్‌గా నటించేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏమనుకున్నారు ఇలాంటి టాలెంట్‌ కూడా అమ్మడిలో ఉంది మరి. సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడూ కనిపించే ఆండ్రియా తాజాగా ఇదిగో ఇలా దర్శనమిచ్చింది. ఈ ఫోటోలో హాట్‌ అండ్‌ క్యూట్‌ గ్లామర్‌తో ఆండ్రియా అందం సింప్లీ సూపర్బ్‌ అనిపించేస్తోంది కదా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS