మహేష్‌బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. `సర్కారు వారి పాట` తరవాత మహేష్ చేయబోయే సినిమా ఇదే. ఆల్మోస్ట్ స్క్రిప్టు రెడీ. సెట్స్‌పైకి వెళ్లడమే తరువాయి. ఈ సినిమాలో కథానాయికలు, ఇతర కీలక పాత్రధారుల ఎంపిక జరుగుతోంది. ఈలోగా.. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే... ఈసినిమాలో ఓ కీలకమైన పాత్రకు బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్‌ని ఎంచుకున్నార్ట. ఆయన ఇందులో మహేష్‌కి తండ్రిగా నటిస్తున్నారని తెలుస్తోంది.
బాపు దర్శకత్వంలో `వంశ వృక్షం` అనే సినిమాతో టాలీవుడ్ లో మెరిశాడు అనిల్ కపూర్. ఆ తరవాత.. తెలుగులో సినిమానే చేయలేదు. మహేష్ సినిమా ఒప్పుకుంటే గనుక... సుదీర్ఘ విరామం తరవాత మళ్లీ తెలుగులో కనిపించినట్టవుతుంది. ఇటీవల పాన్ ఇండియా సినిమాల జోరు ఎక్కువైంది. పెద్ద హీరో సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాల్సిందే. అందుకే నటీనటుల్ని కూడా ఆ లెక్కలోనే ఎంచుకుంటున్నారు. మహేష్ - త్రివిక్రమ్ సినిమానీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తారని, అందులో భాగంగానే అనిల్ కపూర్‌ని ఎంచుకోవాల్సివచ్చిందని టాక్.