మ‌హేష్ మేట‌ర్ తేల్చేసిన అనిల్ రావిపూడి.

మరిన్ని వార్తలు

మ‌హేష్‌బాబు చాలా ఫ్రెండ్లీ హీరో. ఓ ద‌ర్శ‌కుడ్ని న‌మ్మితే... త‌న‌తో మ‌రిన్ని సినిమాల‌కు ట్రావెల్ చేయ‌డానికి రెడీగా ఉంటారు. అనిల్ రావిపూడితో కూడా మ‌హేష్‌కి మంచి సాన్నిహిత్యం కుదిరింది. ఎంత‌గా అంటే.... `స‌రిలేరు నీకెవ్వ‌రు` త‌ర‌వాత మ‌రో సినిమా చేసేయాలి అనేంత‌గా. మ‌హేష్ - అనిల్ రావిపూడి కాంబోలో మ‌రో సినిమా త్వ‌ర‌లోనే రాబోతోంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. దానికి తోడు `ఎఫ్ 3`లోనూ మ‌హేష్ న‌టిస్తున్నాడ‌ని అనుకున్నారు. వీటిపై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశారు.

 

ఎఫ్ 2లో క‌నిపించిన హీరోలూ, హీరోయిన్లే ఎఫ్ 3లోనూ ఉంటార‌ని, కొత్త హీరోలెవ‌రూ ఉండ‌ర‌ని తేల్చేశారు. మ‌హేష్‌ని ఓ ద‌శ‌లో అనుకున్న మాట నిజ‌మే అని, అయితే.. క‌థా చ‌ర్చ‌ల్లో ర‌క‌ర‌కాల పేర్లు వ‌స్తాయ‌ని, చివ‌రికి కొన్ని నిల‌బ‌డ‌వ‌ని ఇది కూడా అంతేన‌ని అన్నారు. మ‌హేష్ తో మ‌రో సినిమా ఎప్పుడు ? అని అడిగితే ''త‌ప్ప‌కుండా ఉంటుంది. కానీ ఎప్పుడ‌న్న‌ది చెప్ప‌లేం. ప్ర‌స్తుతం నా దృష్టంతా ఎఫ్ 3 పైనే'' అని క్లారిటీ ఇచ్చాడు. మ‌హేష్ చేతిలో చాలా ప్రాజెక్టులు లైనులో ఉన్నాయి. అవ‌న్నీ పూర్త‌యి... అనిల్ రావిపూడి టైమ్ వ‌చ్చేస‌రికి క‌నీసం 2 ఏళ్ల‌యినా ప‌డుతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS